నెట్ ఫ్లిక్స్ లోని టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న 10 మూవీస్ ఇవే!

నెట్ ఫ్లిక్స్ లోని టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న 10 మూవీస్ ఇవే!

Netflix Top 10 Trending Movies: ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ప్పటికప్పుడు డజన్ల కొద్ది సినిమాలను, వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఈ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈవారం టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Netflix Top 10 Trending Movies: ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ప్పటికప్పుడు డజన్ల కొద్ది సినిమాలను, వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఈ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈవారం టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మూవీ లవర్స్ కు వీకెండ్ స్టార్ అయితే చాలు.. ఏ సినిమాలు, వెబ్ సిరీస్ ఏ ఓటీటీలోకి వస్తాయా అని తెగ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా వాటిలో బో*ల్డ్, స్పై, ఫాంటసీ అడ్వెంచర్ జోనర్స్‌లలో వచ్చిన సినిమాలంటే.. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు.  ఇక ప్రేక్షకుల ఇంట్రెస్ట్ మేరకు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కూడా మంచి మంచి కంటెంట్ ల తో సినిమాలు తీసుకొస్తున్నాయి. అయితే వీటిలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ కూడా భారీ ధరకు కొనుగోలు చేసి ప్రేక్షకులు ముందుచడంలో నెట్ ఫ్లిక్స్ సాటి ఏదీ లేదని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే.. ఎప్పటికప్పుడు డజన్ల కొద్ది సినిమాలను, వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఈ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈవారం టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. వీటిలో బో*ల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ నుంచి స్పై యాక్షన్ మూవీస్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు, బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. మరీ ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిర్ ఆయీ హసీన్‌ దిల్‌రూబా

హీరోయిన్ తాప్సీ నటించిన లేటెస్ట్ బో*ల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫిర్ ఆయీ హసీన్‌ దిల్‌రూబా. కాగా, ఈ సినిమాలో తాప్సీతో పాటు విక్రాంత్ మాస్సె, విక్కీ కౌశల్ కీలక పాత్రలో పోషించారు. ఇకపోతే ఈ సినిమా ఈ ఆగస్ట్ 9వ తేదీన నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అంతేకాకుండా.. మొదటి రోజు నుంచే ఈ సినిమా మంచి రెస్సాన్స్ తెచ్చుకోవడమే కాకుండా.. ఈ వారం టాప్ 1 ప్లేస్ లో ఈ మూవీ నిలిచింది.

ఇండియన్ 2

లోక నాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ వచ్చిన  ఫ్రాంచైజీ  మూవీ ఇండియన్ 2. కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.  ఈ క్రమంలోనే.. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీన నెట్ ఫ్లిక్స్  ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. అయతే మొదట్లో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఇండియాన్ 2 ఇప్పుడు మాత్రం నెట్ ఫ్లిక్స్ లో టాప్ 2 ట్రెండింగ్ లో సత్తా చాటుతోంది.

ది యూనియన్ 

కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన మూవీ ది యూనియన్. ఇదొక హాలీవుడ్ మూవీ. కాగా, ఇందులో హాలీ బెర్రీ, మార్క్ వాల్‌బర్గ్ మెయిన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇకపోతే ఈ మూవీ ఆగస్ట్ 16న నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ వచ్చింది. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ సినిమా మూడు రోజుల్లోనే టాప్ 3 స్థానంలో నిలిచింది.

షాజమ్: ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్ 

సూపర్ కామెడీ యాక్షన్ గా హాలీవుడ్ లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా షాజమ్: ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్ ఒకటి. అయితే డిస్నీ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ సూపర్ హీరో కామెడీ యాక్షన్ మూవీ షాజమ్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 17 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. షాజమ్ మూవీకి సీక్వెల్ షాజమ్ 2 రెండు రోజుల్లోనే నాలుగో స్థానంలో ట్రెండ్ అవుతోంది.

మహారాజ 

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మహారాజ. అయితే ఈ మూవీ ఇప్పటికి నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. పైగా ఈ వారం కూడా నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5 ప్లేస్ లో మహారాజా ట్రెండింగ్ లో ఉంది. కాా, ఇప్పటికే ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఐఎమ్‌డీబీ పదికి 8.7 రేటింగ్ ఇచ్చింది.

డంజన్స్ అండ్ డ్రాగన్స్: హానర్ అమాంగ్ థీవ్స్ 

ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా వచ్చిన డంజన్స్ అండ్ డ్రాగన్స్: హానర్ అమాంగ్ థీవ్స్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడు  టాప్ 6 ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా కనుక చూడకపోయిన వారు ఉంటే వెంటనే ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో చూసేయండి.

కింగ్స్‌మన్: ది సీక్రెట్ సర్వీస్
స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన సినిమా  కింగ్స్‌మన్: ది సీక్రెట్ సర్వీస్. అయితే ఈ మూవీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది. కానీ, ఇంతకు ముందు ఈ సినిమా  డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కాగా, ఇటీవలే ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మూీ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 7లో ట్రెండింగ్ అవుతోంది.

ఇక ఈ మూవీస్ మాత్రమే కాకుండా.. 2021లో వచ్చిన తాప్సీ బోల్డ్ మూవీ హసీన్ దిల్‌రూబా టాప్ 8 స్థానంలో, స్పై యాక్షన్ కామెడీ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన కింగ్స్‌మన్: ది గోల్డెన్ సర్కిల్ టాప్ 9 ప్లేసులో, షాలినీ పాండే నటించిన మహారాజ్ మూవీ టాప్ 10లో ట్రెండింగ్‌లో నిలిచింది. మరీ, ఈ సినిమాలేవి ఇప్పటి వరకు చూడకపోతే వెంటనే ఈ సినిమాలను నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో వెంటనే చూసేయండి.

Show comments