ఈ వారం OTT లో ఈ 3 కామెడీ చిత్రాలు చాలా స్పెషల్.. నవ్వు ఆపుకోలేరు

Must Watch Movies Telugu In OTT :గత వారంతో పోలిస్తే ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలు , సిరీస్ ల జాబితా తక్కువే అని చెప్పి తీరాలి. అయితే మరి వీటిలో ఈ వారం అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలేంటో చూసేద్దాం.

Must Watch Movies Telugu In OTT :గత వారంతో పోలిస్తే ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలు , సిరీస్ ల జాబితా తక్కువే అని చెప్పి తీరాలి. అయితే మరి వీటిలో ఈ వారం అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలేంటో చూసేద్దాం.

ప్రతి వారం ఏ ఏ సినిమాలు ఏ ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయనే లిస్ట్ తో పాటు.. ఏ సినిమాలను మిస్ కాకుండా చూడాలి అనే లిస్ట్ కూడా వస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి వారం ఎదో ఒక తెలుగు మూవీ , సిరీస్ నేరుగా ఓటీటీ లో రిలీజ్ అవ్వడం చూస్తూనే ఉన్నాము. కానీ ఈ వారం మాత్రం అలాంటి స్పెషల్ మూవీస్ తక్కువే ఉన్నా కానీ.. రిలీజ్ అయ్యే మూవీస్ కు మాత్రం స్పెషాలిటీ ఉంది . ఎందుకంటే ఈ వారం మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలన్నీ కూడా కామెడీ చిత్రాలే. ఈ క్రమంలో ఈ వారం అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలేంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయనే విషయాలను చూసేద్దాం.

చట్నీ సాంబార్ :

కోలీవుడ్ లో టాప్ కమెడియన్ యోగిబాబు నటించిన మూవీ “చట్నీ సాంబార్”. ఈ వెబ్ సిరీస్ నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. పైగా తమిళంతో పాటు తెలుగు, మలయాళం , కన్నడ భాషల్లో కూడా చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు మేకర్స్.ఇక చట్నీ సాంబార్ సిరీస్ కథ విషయానికొస్తే.. అముద కేఫ్ అనే హోటల్ చుట్టూ ఈ సిరీస్ కథ కొనసాగనుంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎంత మందిని కడుపుబ్బా నవ్వించేస్తుందో వేచి చుడాలి. ఈ సిరీస్ జూలై 26 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

రాజు యాదవ్:

గెట్ అప్ శ్రీను హీరోగా “రాజు యాదవ్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మే 24 న థియేటర్ లో రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాలో ఆనంద చక్రవాణి, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్, రాకెట్ రాఘవ లాంటి ఎంతో పరిచయస్తులు.. ముఖ్య పాత్రలలో నటించారు. కానీ థియేటర్ లో ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా జూలై 24 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కు రానుంది.

భరతనాట్యం:

ఈ సినిమాకు దొరసాని మూవీ డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 5 న థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకోగా.. జూలై 27 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఓటీటీ లో ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

ఇక ఈ సినిమాలే కాకుండా వీకెండ్ లోపు.. సడెన్ గా ఓటీటీ లోకి మరికొన్ని సినిమాలు ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments