OTTలోకి వచ్చిన విక్రమ్ తంగలాన్ సినిమా..కానీ ఓ ట్విస్ట్!

Thangalaan Movie OTT Streaming: చియాన్ విక్ర‌మ్ నటించిన తంగలాన్ మూవీ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ మూవీ ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ముందుకు వచ్చింది. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది.

Thangalaan Movie OTT Streaming: చియాన్ విక్ర‌మ్ నటించిన తంగలాన్ మూవీ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ మూవీ ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ముందుకు వచ్చింది. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది.

వారం వారం అనేక సినిమాలు ఓటీటీలో రిలీజై సందడి చేస్తుంటాయి. హర్రర్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ వంటి వివిధ జోనర్ల మూవీలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలు వస్తాయా అని మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎప్పటి మాదిరిగానే ఈ నెలలో ఓటీటీ ప్రేక్షకులను మెప్పించడానికి చాలానే ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీలు రెడీ గా ఉన్నాయి. అలాంటి వాటిలో చియాన్ విక్రమ్ లేటెస్ట్ గా నటించిన తంగలాన్ మూవీ. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ మూవీ ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయిపోతుంది. అందరికి సర్ ఫ్రైజ్ ఇస్తూ తాజాగ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. మరి.. ఆ ట్విస్ట్ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

చియాన్ విక్ర‌మ్ నటించిన తంగలాన్ మూవీ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శ‌నివారం నుంచి ఈ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీ ఎంథుస‌న్ అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడే మేకర్స్ ఓ ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ సినిమాను అందరు వీక్షించే అవకాశంలేదు. ఈ ఓటీటీలో ఓవ‌ర్‌ సీస్ ఆడియెన్స్ మాత్ర‌మే తంగ‌లాన్ మూవీని చూసే అవ‌కాశం ఉంది. భారత దేశంలోని ప్రేక్షకులు మాత్రం తంగ‌లాన్ మూవీని ఓటీటీలో చూడాలంటే మ‌రికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఈ మూవీని అన్ని దక్షిణాది భాషల్లో సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ మూవీని థియేటర్ లో మిస్ అయినా వారు ఎంచక్కా ఓటీటీ లో చూసేయండి.

పా రంజిత్ డైరెక్షన్ లో చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ ఆగష్టు 15 న థియేటర్ లో రిలీజ్ అయింది. విడుదలైన తొలి రోజు నుంచి కూడా ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లో భారీ బజ్ క్రియేట్ చేసింది. అంతేకాక ఈ సినిమాకు ఫుల్ పాజిటీవ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా తమిళ నాట ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ లభించింది. దాదాపు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా ఓవర్ సీస్ లో ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా త్వరలో మన ఇండియన్ ఆడియాన్స్ కు  ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయిపోతుంది.

ఇక  తంగలాన్ సినిమా విషయానికొస్తే..  కోలార్ గోల్డ్ ఫీల్డ్ బ్యాక్డ్రాప్ లోనే ఈ సినిమాను మేకర్స తెరకెక్కించారు. ఆ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో .. బంగారు నిక్షేపాల కోసం అక్కడ గిరిజనుల చేసే అన్వేషణ గురించి ఇందులో చూపించారు. అంతేకాక ఆ సమయంలో ఆ గిరిజనుల జీవన పరిస్థితులు , బ్రిటిష్ వారి పాలనలో వారు అనుభవించిన సమస్యలు వంటి అనేక అంశాల గురించి చాలా క్షుణ్ణంగా.. చూపించారు మేకర్స్. నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. కాబట్టి సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments