Swetha
OTT Telugu Movie- Sopathulu: డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ క్రేజ్ బాగా పెరిగిపోతుంది. థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఓటీటీ లోకి రావడంతో పాటు.. డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. తాజాగా ఈ లిస్ట్ లోకి మరొక మూవీ యాడ్ అయింది. ఆ మూవీ ఏంటో చూసేద్దాం.
OTT Telugu Movie- Sopathulu: డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ క్రేజ్ బాగా పెరిగిపోతుంది. థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఓటీటీ లోకి రావడంతో పాటు.. డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. తాజాగా ఈ లిస్ట్ లోకి మరొక మూవీ యాడ్ అయింది. ఆ మూవీ ఏంటో చూసేద్దాం.
Swetha
నిన్న మొన్నటి వరకు కూడా ఓటీటీ అంటే అన్ని రకాల సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. కంటెంట్ బావుంటే కనుక ఓటీటీ లోకి వచ్చిన ప్రతి సినిమాను , సిరీస్ ను లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు హిట్ చేస్తూనే ఉంటారు. అయితే రానున్న రోజుల్లో మాత్రం తెలుగు కంటెంట్ హావ పెరిగేలా ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు కాకుండా.. డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలు , సిరీస్ ల సంఖ్య పెరుగుతూ ఉంది . వాటికి లభించే ఆదరణ కూడా అలాగే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ కామెడీ మూవీ యాడ్ అవుతుంది. మరి ఈ మూవీ ఏంటో ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ కోసం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ చాలానే ఉన్నాయి. కానీ వాటిలో అచ్చ తెలుగు కంటెంట్ ను అందించే ప్లాట్ ఫార్మ్స్ మాత్రం రెండే.. ఆహా , ఈటీవీ విన్. వీటిలో ఈటీవీ విన్ విషయానికొస్తే.. ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ ఒరిజినల్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ‘సోపతులు’ అనే ఎమోషనల్ కామెడీ మూవీని రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది ఈటీవీ విన్ ప్లాట్ ఫార్మ్. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో భాను ప్రకాష్, సృజన్, మణి అగుర్ల, మోహన్ భగత్ ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ సినిమాకు అనంత్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీని సెప్టెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా స్టోరీ అంతా కూడా తొమ్మిదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారుల చుట్టూ ఈ కథ కొనసాగుతూ ఉంటుంది. ఆన్ లైన్ క్లాస్ లను అటెండ్ అయ్యేందుకు వారిద్దరికీ స్మార్ట్ ఫోన్స్ అవసరం వస్తుంది. ఆ ఫోన్ కోసం ఆ ఇద్దరు చేసే ప్రయత్నాలు , ఎడ్వెంచర్లు .. ఈ క్రమంలో ఎదుర్కున్న కష్టాలు ఆసక్తిగా కొనసాగుతూ ఉంటాయి. ఇక మూవీ అంతా కూడా పూర్తిగా తెలంగాణ బ్యాక్డ్రాప్ లో కొనసాగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఇలాంటి బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలు , సిరీస్ లు బాగానే ఆదరణ పొందాయి. కాబట్టి ఈ మూవీ కూడా మంచి సక్సెస్ సాదిస్తుందని చెప్పి తీరాల్సిందే. మరి ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.