OTT లోకి సరికొత్త స్పై యాక్షన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: డయానా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Spy Action Thriller Series-Citadel Diana In Telugu: ఓటీటీ లోకి వచ్చే సినిమాలు , సిరీస్ లు ఏ లాంగ్వేజ్ లో ఉన్నా సరే.. వాటికి తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉందంటే.. ప్రేక్షకులు కచ్చితంగా చూస్తారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ లోకి రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

OTT Spy Action Thriller Series-Citadel Diana In Telugu: ఓటీటీ లోకి వచ్చే సినిమాలు , సిరీస్ లు ఏ లాంగ్వేజ్ లో ఉన్నా సరే.. వాటికి తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉందంటే.. ప్రేక్షకులు కచ్చితంగా చూస్తారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ లోకి రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

టాలీవుడ్ ,బాలీవుడ్ అని తేడా లేకుండా ఓటీటీ లోకి ఏ లాంగ్వేజ్ లో సినిమాలు వచ్చినా కానీ.. కంటెంట్ ను బట్టి ఆదరిస్తూ ఉంటారు. ఇక ఆ సినిమాలు , సిరీస్ లు తెలుగులో కూడా అందుబాటులోకి ఉన్నాయంటే.. ప్రేక్షకులు కచ్చితంగా మిస్ చేయకుండా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ రాబోతుంది. వెబ్ సిరీస్ లను బాగా చూసే వారికి ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ గురించి తెలిసే ఉంటుంది. అదే అమెరికన్ పాపులర్ సిరీస్ సిటాడెల్. ఇప్పుడు ఈ సిటాడెల్ ఆధారంగా ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వస్తుంది. కానీ ఇది సమంత చేస్తున్న సిటాడెల్ కాదు. ఈ సిరీస్ పేరు.. ‘సిటాడెల్:డయానా’. తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.మరి ఈ సిరీస్ ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

సిటాడెల్:డయానా వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్ కు మంచి హైప్ ఉంది. కాగా ఈ సిరీస్ లో.. మటిల్డా డే ఏంజెలిస్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ను ఇష్టపడే వారికి ఈ సిరీస్ కచ్చితంగా నచ్చేస్తుంది. ఈ సిరీస్ ట్రైలర్ తో పాటు.. స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. అక్టోబర్ 10 నుంచి ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ సిరీస్ ను ఇటాలియన్ తో పాటు.. ఇంగ్లీష్ , తెలుగు, హిందీ , తమిళం , కన్నడ , మలయాళ భాషల్లో .. ఈ సిరీస్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి.

ఇక ఈ సిరీస్ ట్రైలర్ విషయానికొస్తే.. ట్రైలర్ అంతా కూడా.. కంప్లీట్ యాక్షన్ సీన్స్ తో నిండిపోయిందని చెప్పి తీరాలి. ఆల్రెడీ ఈ సిరీస్ ను చూసిన వారికి కథ గురించి కాస్త అవగాహన ఉండి ఉంటుంది. సిటాడెల్ ఏజెన్సీని నాశనం చేసిన.. సిండికేట్ మాంటికోర్ పై.. ప్రతీకారం తీర్చుకునేందుకు.. డయానా రెడీ అవుతుంది. దాని కోసం చాలా పోరాడుతుంది. దీనితో ఈ సిరీస్ మొత్తం కూడా షూటింగ్ , ఫైట్ లు, బ్లాస్టింగ్ లు.. ఇలా మొత్తం యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది. ఇక ఈ సిరీస్ లో మటిల్డా డె ఏంజిలిస్‍తో పాటు లోరెండో సెర్వాసియో, మౌరిజియో లాంబర్డి, జూలియా పియాటోన్, థెక్లా రౌటెన్, డానియెలే పవోలినీ, బెర్న్ హార్డ్ ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ సిరీస్ కు అర్నాల్డో కాటినరా డైరెక్టర్ గా వ్యవహరించారు. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments