OTT Suspense Thriller : OTT లో ట్రెండింగ్ లోకి వచ్చేసిన రీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్.. దీనిని కానీ మిస్ చేశారా!

OTT లో ట్రెండింగ్ లోకి వచ్చేసిన రీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్.. దీనిని కానీ మిస్ చేశారా!

OTT Suspense Thriller: అదేంటో తెలియదు కానీ.. థియేటర్ లో సక్సెస్ కానీ సినిమాలు.. ఓటీటీ లోకి వచ్చిన వెంటనే ఇట్టే ప్రేక్షకులను మెప్పించి ట్రెండింగ్ లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రీసెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ కూడా యాడ్ అయింది. మరి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

OTT Suspense Thriller: అదేంటో తెలియదు కానీ.. థియేటర్ లో సక్సెస్ కానీ సినిమాలు.. ఓటీటీ లోకి వచ్చిన వెంటనే ఇట్టే ప్రేక్షకులను మెప్పించి ట్రెండింగ్ లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రీసెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ కూడా యాడ్ అయింది. మరి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

థియేటర్ లో రిలీజ్ అయినా కొన్ని సినిమాలు.. పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నా కానీ.. కలెక్షన్స్ అంతగా రాబట్టలేవు. దీనితో ఈ సినిమాలు ప్లాప్ అయినట్లే భావిస్తూ ఉంటారు. అయితే అదేంటో తెలియదు కానీ థియేటర్ లో సక్సెస్ కానీ సినిమాలు.. ఓటీటీ లోకి వచ్చిన వెంటనే ఇట్టే ప్రేక్షకులను మెప్పించి.. ట్రెండింగ్ లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రీసెంట్ గా వచ్చిన మరొక ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ యాడ్ అయింది. మరి ఈ సినిమా ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? ఈ సినిమాను మీరు కానీ మిస్ చేశారేమో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా పేరు.. ‘సావి’. బాలీవుడ్ స్టార్ నటుడు అనిక్ కపూర్ , దివ్య కోశల , హర్ష వర్ధన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ.. మే 31 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. టాక్ పరంగా బాగానే ఉన్నా కూడా.. కలెక్షన్స్ పరంగా సక్సెస్ సాధించలేకపోయింది. కానీ రీసెంట్ గా నే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. గతవారమే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా వెంటనే టాప్ 10 లో రెండవ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ సినిమాకు అభినయ్ దేవ్ దర్శకత్వం వహించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఎలాగూ ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి.. త్వరలో తెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎక్కడో ఇండియాకు దూరంగా.. బ్రిటన్ లో ఉండే భార్య భర్తలు.. ప్రేమించి పెళ్ళి చేసుకుని.. తమ కొడుకుతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. వారే సావి , నకుళ్. సావి కి భర్త , బిడ్డ తప్ప మరొక ప్రపంచం తెలియదు. అంత బాగానే సాగిపోతున్న వారి జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు అన్నిటిని.. తారుమారు చేసేస్తాయి. ఓ తప్పుడు మర్డర్ కేసులో ఏకంగా 12 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. పైగా జైల్లో అతనిని చంపడానికి ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తూ ఉంటుంది. దీనితో సావి ఎలాగైనా తన భర్తను జైలు నుంచి బయటకు తీసుకురావాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? సావి అనుకున్నట్లుగా చేయగలిగిందా లేదా? నకుళ్ బయటకు వచ్చాడా లేదా? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments