OTT Telugu Recent Crime Thriller: OTT లో దూసుకుపోతున్న పాయల్ 'రక్షణ' మూవీ.. ఇంకా చూడలేదా !

OTT లో దూసుకుపోతున్న పాయల్ ‘రక్షణ’ మూవీ.. ఇంకా చూడలేదా !

OTT Telugu Recent Crime Thriller: అదేంటో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో థియేటర్ లో నిరాశ పరచిన సినిమాలు.. ఓటీటీ లో సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంటున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయింది.మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Telugu Recent Crime Thriller: అదేంటో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో థియేటర్ లో నిరాశ పరచిన సినిమాలు.. ఓటీటీ లో సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంటున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయింది.మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు క్రేజ్ బాగా పెరిగిపోతోందన్న సంగతి.. ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలే చెప్పేస్తున్నాయి. థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఫాస్ట్ గా ఓటీటీ లోకి రావడమే కాదు.. థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించని సినిమాలు కూడా.. ఓటీటీ లో మాత్రం ఇట్టే హిట్ టాక్ సంపాదించుకుంటున్నాయి. ఇలా ఇప్పటివరకు ఓటీటీ లో చాలానే సినిమాలు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రీసెంట్ గా పాయల్ మెయిన్ లీడ్ లో నటించిన ‘రక్షణ’ మూవీ కూడా యాడ్ అయింది. మరి ఈ సినిమా ఎన్ని వ్యూస్ ను దక్కించుకుందో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వంలో పాయల్ రాజ్‍పుత్ ప్రధాన పాత్రలో నటించిన ‘రక్షణ’ సినిమా.. జూన్ 7 న థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ అనుకున్న రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీనితో త్వరగా థియేట్రికల్ రన్ ను కంప్లీట్ చేసుకుని.. ఆగష్టు 1 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక మూవీ స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన పది రోజుల్లోనే 60 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది ఈ సినిమా. రక్షణ మూవీ మేకర్స్ ను థియేటర్స్ లో నిరాశ ఎదురైనా కానీ.. ఓటీటీలో మాత్రం మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీని ఇంకా ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ వీకెండ్ ఒక మంచి సస్పెన్స్ డ్రామా కోసం చూస్తుంటే మాత్రం ఈ మూవీ బెస్ట్ ఛాయస్.

ఇక మూవీ కథ విషయానికొస్తే.. పాయల్ ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉన్న సమయంలో.. ఆమె ఫ్రెండ్ ప్రియ ఆత్మహత్య చేసుకుంటుంది. అది హత్య అని పాయల్ కు తెలిసినా కానీ.. ఆధారాలు లేక ఏమి చేయలేకపోతోంది. ఇక ఆ తర్వాత ఆమె.. ట్రైనింగ్ పూర్తి చేసుకుని.. ఏసీపీ గా బాధ్యతలు స్వీకరిస్తుంది. ఈ క్రమంలో అరుణ్ అనే అతను పాయల్ ను ఇబ్బంది పెట్టేలా.. ఆమె ఫోటోలను, వీడియోలను వెబ్ సైట్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. అతనిపై ఏదైనా యాక్షన్ తీసుకుందాం అనుకునే లోపే అతని కూడా ఓరోజు ఆత్మహత్య చేసుకుని.. చనిపోతూ దానికి కారణం పాయల్ అని చెప్తాడు. అతనిది కూడా ఆత్మహత్య కాదని.. హత్యేనని.. పాయల్ కు అర్ధమౌతుంది. హత్యలను ఆత్మహత్యలుగా ఎందుకు చూపిస్తున్నారు ? ఆ హత్యలు చేస్తుంది ఎవరు ? పాయల్ ఈ కేసును సాల్వ్ చేసిందా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments