Swetha
OTT Best Fantasy Movie-The Curious Case of Benjamin Button: ఇప్పటివరకు ఎన్నో ఫాంటసి డ్రామాలు చూసి ఉంటారు. కానీ ఇలాంటి మూవీ మాత్రం చూసి ఉండరు . కచ్చితంగా ఈ మూవీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ను ఇస్తుందని చెప్పి తీరాల్సిందే. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.
OTT Best Fantasy Movie-The Curious Case of Benjamin Button: ఇప్పటివరకు ఎన్నో ఫాంటసి డ్రామాలు చూసి ఉంటారు. కానీ ఇలాంటి మూవీ మాత్రం చూసి ఉండరు . కచ్చితంగా ఈ మూవీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ను ఇస్తుందని చెప్పి తీరాల్సిందే. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.
Swetha
ఎక్కడైనా మనిషి పెరిగే కొద్దీ.. మనిషి వయస్సు కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏ మనిషైనా పుట్టేటప్పుడు చిన్నపిల్లాడిగానే పుడతాడు. కానీ ఈ సినిమాలో మాత్రం రివర్స్ లో జరుగుతుంది. ఇదొక కంప్లీట్ ఫాంటసీ డ్రామా. ఇప్పటివరకు ఎన్నో ఫాంటసీ డ్రామాస్ చూసి ఉంటారు కానీ.. ఇలాంటి మూవీ మాత్రం చూసి ఉండరు. కచ్చితంగా ఈ మూవీ డిఫరెంట్ ఎక్సెపెరియన్స్ ఇస్తుంది. పైగా ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. అసలు కథలోకి వెళ్తే డైసీ అనే ముసలావిడ హాస్పిటల్ లో డెత్ బెడ్ పై ఉంటుంది. అక్కడ ఆమె కూతురు కూడా ఉండి.. తన తల్లిని చూస్తూ బాధపడుతుంది. తన బాధను పోగొట్టడానికి.. ఆమె బెంజమిన్ స్టోరీని చెప్తుంది. బెంజామిన్ బొటన్ అనే వ్యక్తి పుట్టడమే ముసలివాడిగా పుడతాడు. అప్పుడు అతనికి 70 సంవత్సరాలు ఉంటాయి. ఇతను పుట్టడంతోనే తల్లి చనిపోతుంది. దీనితో అప్పటినుంచి నర్సింగ్ హోమ్ లో ఉండే ఆమె అతనిని పెంచుతుంది . రోజులు గడిచే కొద్దీ అతను ముసలివయస్సు నుంచి యంగ్ గా మారుతూ ఉంటాడు . పుట్టడం ముసలిగా ఉండి.. వయసు పెరిగే కొద్దీ యంగ్ గా మారడం అతనికి ఉన్న వ్యాధి. ముసలి ఏజ్ లో ఉండడంతో అతను అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. తనకు తానూ అన్ని తెలుసుకుంటూ ఉంటాడు.
క్రమంగా అతని వయసు తగ్గుతూ వస్తుంది. కట్ చేస్తే అతను ఉన్నప్పుడు 7 ఏళ్ళ డైసీ అనే అమ్మాయిని కలుస్తాడు. క్రమంగా అతను వయస్సు తగ్గుతూ ఉంటుంది. మెల్లగా పనిలో కూడా జాయిన్ అవుతాడు. ఈ క్రమంలోనే బెంజమిన్ తన తండ్రిని కలుస్తాడు. కానీ ఇద్దరికి ఒకరికి ఒకరు తెలియదు. అలా పని చేస్తూ బెంజమిన్ దూరం అయిపోతాడు. అలా కొన్నేళ్ల తర్వాత మళ్ళీ డైసీ , బెంజమిన్ కలుసుకుంటారు. వారిద్దరు హ్యాపీగా కలుస్తారు. వారిద్దరూ పెళ్లి చేసుకుని .. ఒక పాపను కూడా కంటారు. కానీ బెంజమిన్ వయస్సు మాత్రం తరిగిపోతూ ఉంటాడు. దీనితో అతను కుటుంబం నుంచి.. పారిపోతాడు. తర్వాత ఏమైంది ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో లాస్ట్ 15 నిముషాలు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది చెప్పి తీరాలి. ఈ సినిమా పేరు ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమిన్ బటన్’. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.