OTT Suggestions- Best Revenge Drama: OTT లో థ్రిల్లర్ నే థ్రిల్ చేసే మైండ్ గేమ్.. బెస్ట్ కొరియన్ రివేంజ్ డ్రామా

OTT లో థ్రిల్లర్ నే థ్రిల్ చేసే మైండ్ గేమ్.. బెస్ట్ కొరియన్ రివేంజ్ డ్రామా

OTT Best Revenge Drama: కొరియన్ డ్రామాస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఓ బెస్ట్ కొరియన్ డ్రామా చూడాలంటే మాత్రం ఈ మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. మరి ఈ మూవీ ఏంటో ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

OTT Best Revenge Drama: కొరియన్ డ్రామాస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఓ బెస్ట్ కొరియన్ డ్రామా చూడాలంటే మాత్రం ఈ మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. మరి ఈ మూవీ ఏంటో ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ అందరికి ఇంట్రెస్ట్ ను కలిగిస్తాయి. ఇక రివెంజ్ స్టోరీస్ అయితే నెక్ట్ లెవెల్ లో ఉంటాయి. అందులోను ఇప్పుడు కొరియన్ డ్రామాస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటూ ఉంటారు. ఈ క్రమంలో ఓ బెస్ట్ కొరియన్ డ్రామా చూడాలంటే మాత్రం ఈ మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. అయితే, ఈ మూవీ క్లైమాక్స్ కొంత మందికి నచ్చుతుంది.. కొంతమందికి కాస్త ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. కానీ మూవీని అర్ధం చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో డైజిన్ అనే వ్యక్తి ఆల్కహాల్ కు బాగా ఎడిక్ట్ అవుతాడు. దీనితో ఓ రోజు బాగా తాగేసి గొడవ చేస్తుంటే.. పోలీసులు అతనిని అరెస్ట్ చేస్తాడు. అక్కడ కూడా గొడవ గొడవ చేస్తున్న క్రమంలో అతని ఫ్రెండ్ వచ్చి అతనిని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకుని వస్తాడు . ఆరోజు అతని కూతురు బర్త్ డే అవ్వడంతో.. ఎక్కువ తాగేస్తాడు. బయటకు వచ్చి తన ఫ్రెండ్ కాల్ మాట్లాడి వచ్చే లోపు డైజిన్ అక్కడ కనిపించడు. కట్ చేస్తే అతను ఓ చిన్న రూమ్ లో పడి ఉంటాడు. ఆ గదిలో ఓ చిన్న కిటికీ మాత్రమే ఉంటుంది. అతను తల బయటపెట్టి చూస్తూ ఉండగా ఎవరో అతనికి ఫుడ్ ఇవ్వడానికి అక్కడకు వస్తారు. ఎందుకు ఇలా బంధించారు అని అడిగితే ఎవరు ఏ సమాధానం చెప్పరు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి.

అతనికి ఆ రూమ్ లో ఓ టీవీ ఉంటుంది. దాని ద్వారా బయట ఏం జరుగుతుందా అనేది తెలుసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ రోజు టీవీ లో తన భార్య ను ఎవరో చంపి పరారయ్యారనే వార్త వస్తుంది. పైగా చంపింది తన భర్తే అని ఇతనిపైనే కేసు నమోదు చేసినట్లుగా కూడా చూపిస్తారు. కానీ హీరోకు తెలుసు అది చేసింది అతను కాదు అని.. ముఖ్యంగా హీరో బాధంతా కూడా అతని నాలుగేళ్ల కూతురు గురించే. ఇక ఆ రూమ్ లో హీరోను టార్చర్ చేస్తూ ఉంటారు. అలా అని అతనికి కావాల్సిన వసతుల్లో మాత్రం ఎలాంటి లోటు చేయరు. ఇలా కొద్దీ రోజులకు అతనిని ఓ సూట్ కేసులో పెట్టి.. అతనిని బయట వదిలేస్తారు. 15 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చిన హీరోకు.. ఇప్పుడు ఇదంతా కొత్త ప్రపంచంలా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అతనికి ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. ఇక్కడ నుంచి కొత్త కథ స్టార్ట్ అవుతుంది. అసలు హీరోను 15 ఏళ్ళు కిడ్నప్ చేసింది ఎవరు ? ఆ తర్వాత ఏమైంది ? ఎందుకు అతనిని దాచిపెట్టారు ? అతని భార్యను చంపింది ఎవరు ? అతని కూతురు ఏమైపోతుంది? ఇవన్నీ తెలియాలంటే ‘ఓల్డ్ బాయ్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే కనుక వెంటనే చూసేయండి.. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments