Swetha
OTT Suggestions- Best Horror Movie His House: ఓటీటీ లో ఎన్ని హర్రర్ మూవీస్ చూసినా కూడా.. ఇంకా చూసేందుకు చాలా మిగిలే ఉంటాయి. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఒకవేళ ఈ హర్రర్ మూవీని కానీ మిస్ చేశారేమో ఓసారి చెక్ చేసేయండి.
OTT Suggestions- Best Horror Movie His House: ఓటీటీ లో ఎన్ని హర్రర్ మూవీస్ చూసినా కూడా.. ఇంకా చూసేందుకు చాలా మిగిలే ఉంటాయి. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఒకవేళ ఈ హర్రర్ మూవీని కానీ మిస్ చేశారేమో ఓసారి చెక్ చేసేయండి.
Swetha
ఈ వారం ఓటీటీ లోకి వచ్చే సినిమాలేంటో.. ఈ వారం అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలేంటో.. ఎప్పటికప్పుడు లిస్ట్ రావడంతో.. ఆయా సినిమాలను అసలు మిస్ చేయకుండా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న కొన్ని సినిమాలను మాత్రం మిస్ చేస్తూ ఉంటారు. ఇక ఓటీటీ లో హర్రర్ సినిమాకలైతే లెక్కే లేదు.. ఎన్ని చూసినా కానీ.. ఇంకా చూసేందుకు చాలా సినిమాలు మిగిలే ఉంటాయి. ఇక ఇప్పుడు చెప్పుకునేది కూడా ఇలాంటి ఓ హర్రర్ సినిమా గురించే. ఈ సినిమా చాలా ఘోరంగా ఉంటుంది. హర్రర్ మూవీ లవర్స్ ఈ మూవీని అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ స్టోరీ సౌత్ సూడాన్ నుంచి యూకే కి వచ్చిన రియాల్, బోల్ అనే ఇద్దరి రెఫ్యూసర్స్ చుట్టూ తిరుగుతుంది. సౌత్ సూడాన్ లో యుద్ధ వాతావరణం ఉండడంతో.. వీరంత మరి కొంతమందితో కలిసి యూకే కి బయల్దేరతారు. అయితే మార్గం మధ్యలో వారి ప్రయాణిస్తున్న బోట్ ప్రమాదానికి గురయ్యి.. వారిలో కొంతమంది చనిపోతారు. వీరి పాపా కూడా చనిపోతుంది. ఇలా కొంతమంది మాత్రమే యూకే కి చేరుకుంటారు. అక్కడ ఓ డిటెన్షన్ సెంటర్ లో ఉంచబడతారు. ఆ తర్వాత ఈ ఫ్యామిలీకి వారు ఒక హౌస్ ను ఇస్తారు. కానీ వారు పూర్తి యూకే సిటిజెన్ షిప్ హక్కులు రావాలంటే మాత్రం.. కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. దానిలో భాగంగా వారు ప్రతి వారం ఆ డిటెన్షన్ సెంటర్ కు సంబంధించిన వారికి రిపోర్ట్ చేస్తూ ఉండాలి. వారు ఇచ్చే మనీ తప్ప బయట ఎలాంటి పని చేయకూడదు. మరే కొత్త ఇంటికి వెళ్ళకూడదు. వీటిలో ఏ ఒక్క రూల్ తప్పిన కూడా.. వచ్చిన ప్లేస్ కే తిరిగి పంపించేస్తాం అని చెప్తారు.
ఇక ఆ తర్వాత వారు ఉండాల్సిన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక అప్పటినుంచి వారు జరిగింది మర్చిపోయి.. కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనీ అనుకుంటారు. కానీ బయటకు రాలేరు. అది కాకుండా అప్పటినుంచి ఇంట్లో వారికి విచిత్రమైన సంఘటనలు ఎదురౌతాయి. చనిపోయిన వాళ్ళ పాపా కూడా వారికి కనిపిస్తుంది. కట్ చేస్తే.. ఆ ఇంట్లోని ఓ గదిలో కొంతమంది పిల్లలు ఉన్నట్లు విజువల్స్ కనిపిస్తాయి. అలా తరచూ వారికి ఏవో ఒక విజువల్స్ కనిపిస్తూనే ఉంటాయి. దీనితో అసలు ఆ ఇంట్లో ఏమౌతుందో ఎవరికీ అర్ధం కాదు. ఓరోజు రియాల్ ఇంట్లో ఉన్నప్పుడు ఆమెను ఎవరు పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. అసలు ఆ ఇంట్లో వీరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ? రియాల్, బోల్ గతం ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే ‘హిస్ హౌస్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా క్లైమాక్స్ అసలు మిస్ అవ్వకుండా చూడాలి . ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.