OTT లో బెస్ట్ హర్రర్ మూవీ ‘క్యాబిన్ ఇన్ ది వుడ్స్’.. అసలు మిస్ చేయొద్దు

OTT Suggestions- Best Horror Movie Cabin In The Woods :ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసి ఉంటారు. పైగా ఈ హర్రర్ సినిమాలలో హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అని ఇలా రకరకాల జోనర్స్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ.. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Suggestions- Best Horror Movie Cabin In The Woods :ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసి ఉంటారు. పైగా ఈ హర్రర్ సినిమాలలో హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అని ఇలా రకరకాల జోనర్స్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ.. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో చాలా తెలుగు సినిమాలు చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలు కాకుండా ఓ మంచి హర్రర్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్. సాధారణంగానే హర్రర్ మూవీస్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు. ఇక ఈ మూవీ చూస్తే.. ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. రెగ్యులర్ హర్రర్ సినిమాలల కాకుండా.. ఇదొక డిఫరెంట్ సైంటిఫిక్ హర్రర్ మూవీ. మీరు కానీ హర్రర్ మూవీ లవర్స్ అయితే మాత్రం ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక ఆర్గనైజషన్ పురాతన రాక్షసుడిని నిద్ర లేపే పనిలో 5 గురు టీనేజర్స్ ను ట్రాప్ చేసి బలి ఇస్తూ ఉంటుంది. ఆ ఆర్గనైజషన్ లో పని చేసే ఇద్దరు చీఫ్ ఆఫీసర్లు మాట్లడుకుంటూ ఉంటారు. వీరు పని చేసే ఆర్గనైజషన్ పూరితమైన రాక్షసులు , దెయ్యాలు వంటి వాటిని బంధించి సాధారణ మానవులపై పరీక్షిస్తూ ఉంటారు. కట్ చేస్తే ఐదుగురు ఫ్రెండ్స్ టూర్ కు వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అది కూడా అడవిలో ఉండే ఆ క్యాబిన్ హౌస్ కే వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అప్పటికే వారు 5 మెంబర్స్ ను ట్రాప్ చేసి ఉంటారు కాబట్టి.. వీరిని   ఆర్గనైజషన్ లో ఉండే వ్యక్తి గమనిస్తూ.. వాళ్ళ ప్రతి మూమెంట్ ను పసిగడుతూ ఉంటారు. బేస్మెంట్ లోని కంట్రోల్ రూమ్ లో ఉంటూ…వారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బయట ఉన్న ఆ ఐదుగురుకి మాత్రం ఈ విషయాలేమి తెలియక సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక ముసలాయన వీరిని ఆ క్యాబిన్ దగ్గరకు వెళ్లోద్దని వాదించినా కూడా.. వీరు వినకుండా ఆ అడవిలో ఉండే క్యాబిన్ దగ్గరకే వెళ్తారు.

కట్ చేస్తే ఆ ఫ్రెండ్స్ అంతా కూడా ఆ క్యాబిన్ లోకి వెళ్తారు. అక్కడ ప్రతిదీ కూడా వారికి అనుమానాస్పదంగానే ఉంటుంది. మరో వైపు బేస్మెంట్ లో ఉన్న ఆఫీసర్స్ వీరిని గమనిస్తూనే ఉంటారు. పైగా వీరి ప్రాణాలమీద బెట్టింగ్స్ వేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. బయట ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి సరదాగా ఆడుకుంటూ ట్రూత్ ఆర్ డేర్ ఆడుకుంటూ ఉండగా.. ఈ ప్రాసెస్ లో వారు అనుకోకుండా బేస్మెంట్ లోకి వెళ్ళిపోతారు. ఇక అక్కడికి నుంచి అసలు కథ మొదలవుతుంది. అక్కడ ఉండే జొంబి దెయ్యాలు వీరిని ఏం చేశాయి ? అసలు ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి ? దేనికి చేస్తున్నారు ? అసలు కథ ఏమై ఉంటుంది ? ఈ 5గురు ఫ్రెండ్స్ బయట పడ్డారా లేదా ? ఆ తర్వాత ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ‘క్యాబిన్ ఇన్ ది వుడ్స్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే కనుక.. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments