Tirupathi Rao
OTT Suggestions- Best Watch Alone Movie Original Sin: యాంజిలీనా జోలీకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె కొన్నేళ్ల క్రితం తీసిన ఒక మంచి థ్రిల్లర్ మూవీ చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, కచ్చితంగా చూడాల్సిన సినిమా అది.
OTT Suggestions- Best Watch Alone Movie Original Sin: యాంజిలీనా జోలీకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె కొన్నేళ్ల క్రితం తీసిన ఒక మంచి థ్రిల్లర్ మూవీ చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, కచ్చితంగా చూడాల్సిన సినిమా అది.
Tirupathi Rao
థ్రిల్లర్ మూవీస్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అది ఏ భాషలో రిలీజ్ అయినా కూడా వదలకుండా చూస్తూ ఉంటారు. అలాంటిది రియాలిటీకి దగ్గరగా ఉండే థ్రిల్లర్ అయితే అస్సలు వదిలిపెట్టరు. అలాంటి ఒక క్రేజీ థ్రిల్లర్ ఎప్పటి నుంచో మనకు అందుబాటులో ఉంది. కానీ, అది మరీ పాత చిత్రం కావడంతో ఎవరికీ తెలియడం లేదు. పైగా అందులో యాంజిలీనా జోలీ ఉడటం మరో విశేషం. ఈ మూవీ చూస్తున్నంత సేపు రియల్ లైఫ్ లో కూడా ఇలాగే జరుగుతోంది కదా అనే భావన కలుగుతుంది. అందుకే ఈ మూవీ అప్పట్లో విపరీతంగా ఆడింది. మరి.. ఆ మూవీ ఏదీ? ఎక్కడ చూడచ్చు? అసలు ఆ మూవీ ఎందుకు అంత స్పెషలో చూద్దాం.
ఈ మూవీ మొత్తం ఎంతో రియలిస్టిక్ గా ఉంటుంది. ఇది ఒక మంచి లవ్ స్టోరీగా స్టార్ట్ అవుతుంది. అది చూస్తున్నంతసేపు అలాగే అనిపిస్తుంది. కానీ, అసలు విషయం రివీల్ అయ్యాక ఫ్యూజులు ఎగిరిపోతాయి. యాంజిలీనా జోలీ ఒక అందమైన యువతి. ఆమె ఒక వ్యక్తికి దగ్గరవుతుంది. అతను కూడా ఆమెను తన జీవితంలోకి రానిస్తాడు. అతడితో ఎంతో సన్నిహితంగా మెలుగుతుంది. అతను ఏం కోరకున్నా ఆమె వద్దు అని చెప్పేది కాదు. అలాగే ఆమె కోరుకున్నది అతను ఇచ్చే దాకా వదిలేది కాదు. అలా వాళ్లమధ్య ప్రేమ.. గాఢమైన బంధానికి దారి తీస్తుంది. అతను ఆమె మాయలో పూర్తిగా మునిగిపోతాడు. అసలు అతనికి ఈ ప్రపంచం కూడా తెలియదు. అయితే అప్పుడే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది.
యాంజిలీనా జోలీ అతడిని ప్రేమించదు. ఆమె అందాన్ని, శరీరాన్ని, ప్రేమ అనే పదాన్ని ఎరగా వేసి అతడిని ముగ్గులోకి దించుతుంది. అతను దానిని ప్రేమ అనుకుంటాడు. కానీ, ఆమె మాత్రం తన అందాన్ని పెట్టుబడిగా పెట్టి అతని సర్వస్వం లాగేసుకుంటుంది. అతని సంపద, కష్టార్జితం, అతని దగ్గర చిల్లిగవ్వ లేకుండా చేస్తుంది. అప్పటి వరకు ఒక మంచి ప్రేమకథ అనుకున్న సినిమా మోసంగా మారిపోతుంది. అక్కడితో ఆగకుండా రివేంజ్ స్టోరీగా దారి మళ్లుతుంది. అతను ఎలాగైనా యాంజిలీనా జోలీ ప్రాణాలు తీయాలి అనుకుంటాడు. ఆమెకోసం వెతుకులాట మొదలు పెడతాడు. ఆమెను ఫేస్ చేస్తాడు కూడా. కానీ, ఆమె అందుకు సిద్ధంగానే ఉంటుంది. మరి.. తన పగ తీర్చుకున్నాడా? ఆమే అతనిపై విజయం సాధించిందా? ఏం జరిగిందో తెలియాలి అంటే మీరు ఈ “ఒరిజినల్ సిన్” అనే మూవీ చూడాల్సిందే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కానీ, మన దగ్గర చూడటానికి వీలులేదు. మీరు ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో ఈ మూవీ చూడచ్చు. అయితే కాస్త బో*ల్డ్ గా కూడా ఉంటుంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.