OTT లో బెస్ట్ హ్యాకింగ్ మూవీ..’హూ యామ్ ఐ’.. క్లైమాక్స్ అసలు మిస్ చేయొద్దు

OTT Suggestions- Best Thriller Movie Who Am I: సస్పెన్స్ డ్రామాస్ , హర్రర్ మూవీస్ చూసి బోర్ కొట్టేసి ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్. ముఖ్యంగా హ్యాకింగ్ అంటే ఇష్టం ఉన్న వారికి ఈ మూవీ బాగా నచ్చేస్తుంది. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

OTT Suggestions- Best Thriller Movie Who Am I: సస్పెన్స్ డ్రామాస్ , హర్రర్ మూవీస్ చూసి బోర్ కొట్టేసి ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్. ముఖ్యంగా హ్యాకింగ్ అంటే ఇష్టం ఉన్న వారికి ఈ మూవీ బాగా నచ్చేస్తుంది. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

ఓటీటీ లో లెక్కకు మించిన సినిమాలు ఉన్నాయి. ఉన్న సినిమాలకు తో పాటు.. ప్రతి వారం ఇంకా కొత్త సినిమాలు యాడ్ అవుతూనే ఉన్నాయి. దీనితో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ను చూడడం మిస్ అవుతున్నారు మూవీ లవర్స్. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. సస్పెన్స్ , యాక్షన్ డ్రామాస్ ను చూసి బోర్ కొట్టేస్తే మాత్రం.. ఈ మూవీ కచ్చితంగా ట్రై చేయాల్సిందే. ముఖ్యంగా హ్యాకింగ్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాల గురించి చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే .. ఈ కథలో సైబర్ క్రైమ్ , హ్యాకింగ్ గురించి చాలా క్లియర్ గా చూపిస్తారు. మూవీ స్టార్టింగ్ లో ఒక అబ్బాయి. తానూ ఈ ప్రపంచంలోనే మోస్ట్ వాన్టేడ్ హ్యాకర్ నని..తానూ తలుచుకుంటే ఈ ప్రపంచం నుంచి ఎవరికీ కనపడకుండా నన్ను నేను దాచిపెట్టుకోగలను. కానీ నేను ఇప్పుడు అలా చేయాలనీ అనుకోవడం లేదని చెప్తాడు. అలా చెప్పి అతను ఓ ప్లాట్ లోపలి వెళ్తాడు, అక్కడ చాలా శవాలు పడి ఉంటాయి. అక్కడే దొరికిన ఓ బులెట్ కవర్ ను చేతిలోకి తీసుకుని హూ యామ్ ఐ అని తనని తనే ప్రశ్నించుకుంటాడు. మళ్ళీ తానే ఐ యామ్ బెంజిమిన్ అని సమాధానం ఇచ్చుకుంటాడు. దీని తర్వాత అతను ఓ ఇంటరాగేషన్ చేసే ప్రదేశానికి వెళ్తాడు. అసలు మ్యాటర్ ఏంటంటే.. అతను ఒక హ్యాకర్.. హ్యాకింగ్ వరల్డ్ లో అతనిని హూ యామ్ ఐ అని అంటూ ఉంటారు.

కట్ చేస్తే ఆ ఇంటరాగేషన్ లో బెంజమిన్ ను హేన అనే ఆమె ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడు బెంజమిన్ తన గతం గురించి మొత్తం చెప్తాడు. తన కుటుంబం గురించి తానూ ఎదిగిన విధానం గురించి.. అసలు హ్యాకింగ్ ఎలా నేర్చుకున్నాడు మొత్తం చెప్తాడు. అయితే హేనా అసలు విషయం చెప్పమని అడుగుతుంది. అతను ఫ్రెంచ్ గ్రూప్ హ్యాకింగ్ చేసే వాళ్ళ గురించి హేన కు చెబుదాం అనుకుంటాడు. సో తానూ చెప్పేది మొత్తం వింటేనే.. ఆ ఫ్రెంచ్ గ్రూప్ వాళ్ళ గురించి తెలుస్తుందని.. బెంజిమెన్ చెప్తాడు. అసలు తానూ ఆ ఫ్రెంచ్ గ్రూప్ కోసం ఏం చెబుదాం అనుకున్నాడు. తర్వాత ఏమైంది ? బెంజిమెన్ గతం ఏంటి ? అనేదే మిగిలిన కథ. సినిమా ఎండింగ్ అసలు ఊహించని విధంగా ఉంటుంది. ఈ సినిమా పేరు ‘హూ యామ్ ఐ’. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది. అయితే ఆల్రెడీ యు ట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి అసలు మిస్ చేయొద్దు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments