OTT Suggestions- The Bad Book Movie: OTTలో బెస్ట్ హారర్ చిత్రం.. ఎంత ధైర్యమున్నా వెన్నులో వణుకు వచ్చేస్తుంది..

OTTలో బెస్ట్ హారర్ చిత్రం.. ఎంత ధైర్యమున్నా వెన్నులో వణుకు వచ్చేస్తుంది..

OTT Suggestions- Best Horror Movie The Bad Book: హారర్ సినిమాలు అంటే అలాంటి ఇలాంటి చిత్రాలు చూడకూడదు. ఇదిలో ఈ మూవీలాగా చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టాలి. అలాంటి మూవీనే మీకోసం తీసుకొచ్చాం.

OTT Suggestions- Best Horror Movie The Bad Book: హారర్ సినిమాలు అంటే అలాంటి ఇలాంటి చిత్రాలు చూడకూడదు. ఇదిలో ఈ మూవీలాగా చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టాలి. అలాంటి మూవీనే మీకోసం తీసుకొచ్చాం.

ఎంత చెప్పుకున్నా హారర్ చిత్రాలు చూడటం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్. కానీ, దానిని మాత్రం వదులుకోలేం. కొందరు అయితే కనీసం వారంలో ఒక హారర్ చిత్రం చూడాల్సిందే. అది కూడా వెన్నులో వణుకు పుట్టేలా ఉండాలి. అలాంటి అలవాటు మీకు కూడా ఉందా? అయితే మీకోసం ఒక క్రేజీ హారర్ చిత్రం తీసుకొచ్చాం. అది కూడా అలాంటి ఇలాంటి హారర్ చిత్రం కాదు. ఒక్కో సీన్ కి వణికిపోతారు. గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఈ కథ మొత్తం ఒక తల్లి, ఆమె కొడుకు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వారి జీవితాల్లో ఎలాంటి భయానక ఘటనలు జరిగాయి? ఎన్ని కష్టాలు పడ్డారు? అనే పాయింట్ మీద కథ నడుస్తూ ఉంటుంది.

హారర్ సినిమాలు మీకు నచ్చాలన్నా.. మీకు ఆ థ్రిల్ల్ రావాలి అన్నా అందులో మంచి హారర్ ఎలిమెంట్స్ ఉండాలి. ఆ ఎలిమెంట్స్ పెట్టే స్కోప్ అక్కడ ఉండాలి. అలాంటి ఒక సినిమానే ఇది. ఇందులో మీకు హారర్ ఎలిమెంట్సే కాదు.. మంచి థ్రిల్ ఇచ్చే కథ కూడా ఉంటుంది. పైగా ఇది ఒక మంచి డ్రామాలా సాగుతూ ఉంటుంది. కథ ఎస్టాబ్లిష్ చేసిన తీరు.. దానిని ముందుకు తీసుకెళ్లిన విధానం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఒక ఊరిలో భర్తను కోల్పోయిన భార్య.. తన చిన్న కొడుకుతూ జీవిస్తూ ఉంటుంది. ఆమె తన ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది. ఆ పిల్లాడు స్కూల్ కి వెళ్తాడు. వాళ్లు ఉండే ఇంట్లో ఆ పిల్లాడికి ఒక పుస్తకం దొరుకుతుంది. తల్లీకొడుకు ఇద్దరూ కలిసి ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభిస్తారు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది.

అసలు ఆ పుస్తకంలో ఏముంది? ఒక రాక్షసుడి గురించి ఆ పుస్తకంలో రాసి ఉంటుంది. అతను వస్తే కచ్చితంగా అనర్థాలు జరుగుతాయి అని ఉంటుంది. ఆ పుస్తకమే చూడటానికి చాలా భయానకంగా ఉంటుంది. అలాంటిది అది చదివిన తర్వాత వారి జీవితాల్లో చాలా వింత ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ పిల్లాడికి రాత్రుళ్లు ఆ పుస్తకంలో ఉన్న రాక్షసుడు కనిపిస్తూ ఉంటాడు. ఆ పిల్లాడిని నిద్రపోనియ్యకుండా వేధిస్తూ ఉంటాడు. తర్వాత ఆ తల్లికి కూడా ఇంట్లో కొన్ని వింత పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.

ఎవరో తనను చూస్తున్నారు అనే భావన కలుగుతుంది. కొన్ని రోజులకు ఇద్దరికీ ఆ రాక్షసుడు కనిపిస్తాడు. వాళ్లను నిద్ర కూడా పోనివ్వకుండా వేధిస్తూ ఉంటాడు. అసలు అతను ఎవరు? ఆ ఇంట్లో వీళ్లు రాకముందు ఎవరు ఉన్నారు? అసలు ఆ దెయ్యానికి ఏం కావాలి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఈ మూవీ పేరు “ది బ్యాడ్ బుక్” ఈ మూవీని మీరు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడచ్చు. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments