OTT లో బెస్ట్ మిస్టరీ మూవీ ‘బూత్ పొరి’.. దీనిని కానీ మిస్ చేశారా!

OTT Suggestions- Best Horror Thriller Bhootpori: ఎన్ని మూవీస్ చూసినా కానీ హర్రర్ మూవీస్ వస్తున్నాయంటే మాత్రం.. ప్రేక్షకులు అసలు మిస్ చేయకుండా చూస్తారు . మరి ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న ఈ హర్రర్ మూవీని కానీ మిస్ అయ్యారేమో ఓసారి చెక్ చేసేయండి.

OTT Suggestions- Best Horror Thriller Bhootpori: ఎన్ని మూవీస్ చూసినా కానీ హర్రర్ మూవీస్ వస్తున్నాయంటే మాత్రం.. ప్రేక్షకులు అసలు మిస్ చేయకుండా చూస్తారు . మరి ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న ఈ హర్రర్ మూవీని కానీ మిస్ అయ్యారేమో ఓసారి చెక్ చేసేయండి.

కొన్ని సినిమాలు స్టార్ట్ చేస్తే అయ్యేంత వరకు అసలు కదలరు. అలా ప్రేక్షకులను ఎంగేజింగ్ గా ఉంచడంలో.. హర్రర్ మూవీ ముందుంటాయి. దాదాపు హర్రర్ మూవీ లవర్స్ ఓటీటీ లోకి వచ్చే అన్ని సినిమాలను అసలు మిస్ చేయకుండా చూస్తూనే ఉంటారు. ఇప్పటికే ఓటీటీ లో లెక్కకు మించిన హర్రర్ మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ హర్రర్ సినిమా గురించే. ఒకవేళ ఈ సినిమాను కనుక మిస్ చేస్తే.. ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మిస్ అయినట్లే. మరి ఈ మూవీ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. సూర్య అనే ఒక చిన్న అబ్బాయికి రాత్రి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో ఓ రోజు అలా డాబా పైకి వెళ్లి వయోలిన్ వాయిస్తూ ఉంటాడు. దీనితో సూర్య అమ్మ ఇది చూసి భయపడి.. ఆ నెక్స్ట్ డే అతనిని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తారు. మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని డాక్టర్ చెప్తాడు. కానీ సూర్య అమ్మకు మాత్రం ఇది నార్మల్ గా అనిపించదు. కొద్దీ రోజులు బయట తిప్పితే అంతా సెట్ అవుతుందని డాక్టర్ చెప్పడంతో.. సూర్య అమ్మ అంజలి ఊరికి వస్తారు. ఆ ఊరిలో వారికి ఓ బంగాళా ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ ఎవరు ఉండకపోవడంతో.. కాస్త పాతదిగా ఉంటుంది. ఇప్పుడు దానిలోనే ఈ ఫ్యామిలీ ఉండాలి. అంజలి వాళ్ళ వంశం సూర్య వలెనే వృద్ధి చెందింది. సో ఆ బంగాళా కూడా తనదే. ఇక వారు ఆ బంగాళాలోకి వెళ్లి ఎప్పటిలానే నార్మల్ గానే ఉంటారు.

ఆ తర్వాత సూర్య ఆ గ్రామమంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో సూర్యకు దుర్గాబరి అనే ఓ అడవి గురించి తెలుస్తుంది. ఆ అడవిలో భూతం ఉందని గ్రామస్థులు నమ్ముతారు. ఆ భూతం పెళ్లికూతురు డ్రెస్ లో తిరుగుతూ ఉంటుందని.. దీనితో ఆ అడవికి వెళ్లోద్దని చెప్తారు. సూర్య కూడా కాస్త కంగారు పడతారు. కట్ చేస్తే ఓ రోజు ఇంటికి వచ్చిన ఎవరినో ఫాలో అవుతూ ఆ అడవిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు తన భయాన్ని తగ్గించుకోవడానికి.. అప్పుడు తన దగ్గరకు భాను అనే ఓ మహిళ వస్తుంది. నిజానికి ఆమె మనిషి కాదు ఒక ఆత్మ. సూర్యకు మాత్రం ఆమె కనిపిస్తుంది. భాను షాక్ అవుతుంది. సూర్య మాత్రం ఆమెతో నార్మల్ గానే మాట్లాడుతూ ఉంటాడు. దీనితో భాను అతనికి వార్నింగ్ ఇచ్చి ఈసారి కనిపిస్తే నమిలి తినేస్తానని.. చెప్తుంది. అసలు సూర్యకు ఆత్మలు ఎందుకు కనిపిస్తున్నాయి ? అడవిలో పెళ్లికూతురులా రెడీ అయ్యి భాను ఆత్మ ఎందుకు తిరుగుతుంది? భాను గతం ఏంటి ? ఆ తర్వాత ఏమైంది ? అనేదే తెరపై చూడాల్సిన కథ. ఈ సినిమా పేరు ‘బూత్ పొరి’. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఎవరైనా ఈ సినిమాను చూడకపోతే.. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి..

Show comments