OTT Suggestion - Best Revenge Action Thriller: 10 రోజుల నుంచి OTT లో ట్రెండ్ అవుతున్న ఈ రివెంజ్ డ్రామాను చూశారా!

OTT Suggestion: 10 రోజుల నుంచి OTT లో ట్రెండ్ అవుతున్న ఈ రివెంజ్ డ్రామాను చూశారా!

OTT Best Revenge Action Thriller: ఒక్కో సారి ట్రెండ్ అవుతున్న సినిమాలను కూడా.. ఏముందిలే అనుకుని లైట్ తీసుకుంటూ ఉంటారు మూవీ లవర్స్. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కానీ మీరు మిస్ చేశారేమో ఓ లుక్ వేసేయండి.

OTT Best Revenge Action Thriller: ఒక్కో సారి ట్రెండ్ అవుతున్న సినిమాలను కూడా.. ఏముందిలే అనుకుని లైట్ తీసుకుంటూ ఉంటారు మూవీ లవర్స్. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కానీ మీరు మిస్ చేశారేమో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ లో ప్రతి వారం సరికొత్త కంటెంట్ వస్తుంది. విభిన్నమైన జోనర్ లో వచ్చే ప్రతి సినిమాను, సిరీస్ ను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. అయితే ప్రతి వారం కొత్త సినిమాలు వస్తున్నా కానీ వాటిలో కొన్ని సినిమాలను మాత్రం మిస్ చేస్తున్నారు మూవీ లవర్స్. మళ్ళీ ఆ సినిమాల గురించి సోషల్ మీడియాలో బజ్ వినిపించేంత వరకు ఆయా సినిమాల గురించి పట్టించుకోరు. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ మధ్య కాలంలో ఓటీటీ లో రిలీజ్ అయిందే. పైగా ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్ లో కూడా ఉంది. ఒక్కో సారి ట్రెండ్ అవుతున్న సినిమాలను కూడా ఏముందిలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు మూవీ లవర్స్. మరి ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కానీ మీరు మిస్ చేశారేమో .. ఇంతకీ ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథేంటంటే.. ఇదొక కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్.. పార్కర్ , స్పైడర్ అనే ఇద్దరు అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీలో స్పై గా వర్క్ చేస్తారు. వారిద్దరూ కూడా ఆపరేషన్ అలైస్ 116 మిషన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తారు. కానీ సరిగ్గా అదే సమయంలో.. పార్కర్ తండ్రి చనిపోయాడని కాల్ వస్తుంది. దీనితో పార్కర్ తన తండ్రిని చూడడానికి సొంత ఊరికి వెళ్తుంది. అక్కడ తన తండ్రి ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడని అందరు చెప్తారు. కానీ అది సూసైడ్ అని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చెప్తాడు. కానీ పార్కర్ ఎందుకో ఆ విషయాన్నీ నమ్మదు. తన తండ్రి మరణం వెనుక ఇంకేదో కారణం ఉందని ఆమె దాని కోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె తండ్రిది హత్య అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది! ఆ హత్య చేసింది ఎవరు ! ఈ హత్య చేసిన వారిని ఆమె ఏం చేసింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా పేరు “ట్రిగ్గర్ వార్నింగ్” . జూన్ 21 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది కంప్లీట్ రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలను చాలానే చూసి ఉంటారు కానీ ఈ సినిమా మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయినా కొన్ని రోజులకే ఈ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా టాప్ టెన్ లో టాప్ 8 ట్రెండింగ్ లో కొనసాగుతుంది. లీవుడ్ పాపులర్ హీరోయిన్ జెస్సికా ఆల్బా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి టాక్ ఏ వస్తుంది. మరి ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments