Best PsychologicalThriller In OTT: OTT లో అరుంధతి లాంటి మూవీ! క్లైమాక్స్ సీన్ పూనకాలతో ఊగిపోతారు!

OTT Movie Suggestion: ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చూసి ఉంటారు కానీ, ఇలాంటి సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. హిప్నటైజ్ బేస్ మీద ఎన్నో థ్రిల్లర్ మూవీ వచ్చాయి. కానీ ఇది మాత్రం నెక్ట్ లెవెల్ మూవీ. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

OTT Movie Suggestion: ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చూసి ఉంటారు కానీ, ఇలాంటి సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. హిప్నటైజ్ బేస్ మీద ఎన్నో థ్రిల్లర్ మూవీ వచ్చాయి. కానీ ఇది మాత్రం నెక్ట్ లెవెల్ మూవీ. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

ఇప్పుడు వచ్చే న్యూ మూవీస్ , సిరీస్ ను మిస్ చేయకుండా చూస్తున్న ప్రేక్షకులు ఆల్రెడీ ఉన్న కొన్ని సినిమాలను మిస్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఓటీటీ లో చూడాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. అన్ని చూసేసాము అని రిలాక్స్ అయ్యే గ్యాప్ కూడా ఇవ్వనన్నీ సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చూసి ఉంటారు కానీ, ఇలాంటి సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. హిప్నటైజ్ బేస్ మీద ఎన్నో థ్రిల్లర్ మూవీ వచ్చాయి. కానీ ఇది మాత్రం నెక్ట్ లెవెల్ మూవీ. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

హిప్నటైజ్ మీద ఇప్పటివరకు చాలా సినిమాలు చూసి ఉంటాం .. తెలుగులో అయితే అరుందతి సినిమాలో ఓ చిన్న ప్లాట్ లో విలన్ హీరోయిన్ ను ఎలా హిప్నటైజ్ చేస్తాడో.. ఆ క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఎవరు మర్చిపోలేరు. ఇప్పుడు చెప్పుకోబోయేది అరుంధతి మూవీ లా అయితే ఉండదు కానీ కాస్త ఆ వైబ్ కనిపిస్తుంది. ఈ సినిమాలో జెన్నిఫర్ అనే అమ్మాయి.. జిన్నా అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి ఓ పార్టీకి వెళ్తుంది. ఆమె అప్పటికి ఏ జాబ్ చేయదు. ఆ పార్టీకి ఓ సైక్రియాట్రిస్ట్ వస్తాడు. జిన్నా జెన్నిఫర్ కు అతనిని పరిచయం చేస్తుంది. ఈ సైక్రియాట్రిస్ట్ వలనే నాకు ఉద్యోగం, ఇల్లు లభించాయని చెప్పుకొస్తుంది, దీనితో జెన్నిఫర్ ఆ సైక్రియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తుంది. అలా అక్కడ ఓ మూడు నెలలు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత.. తనకు జాబ్ అయితే వస్తుంది. కానీ అప్పటినుంచి కొన్ని చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతూ ఉండేది. ఈ విషయం జిన్నా కి చెప్తే తాను కూడా అలానే మర్చిపోతున్నానని చెప్తుంది. దీనితో వీరిద్దరూ కలిసి ఆ డాక్టర్ దగ్గరకు వచ్చిన పేషంట్స్ లిస్ట్ చెక్ చేయగా.. వారికి కొన్ని అనుమానాస్పద విషయాలు తెలుస్తాయి.

అసలు తెరపీ సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటుంది జెన్నీఫర్. దీనితో జెన్నిఫర్ తెరపీ సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకోడానికి తన ఫోన్ లో వాయిస్ రికార్డర్ ఆన్ చేస్తుంది. తెరపీ తనకు అర్ధమయ్యేది ఏంటంటే.. ఆ సైకియాట్రిస్ట్ కేవలం కొంతమంది సెలెక్టెడ్ లేడీస్ ని మాత్రమే హిప్నటైజ్ చేస్తున్నాడని వాళ్ళని చంపేస్తున్నాడనే నిజాన్ని తెలుసుకుంటుంది. ఆ సైకియాట్రిస్ట్ కు వీళ్ళేదో కుట్ర చేస్తున్నారని అర్థమైపోతుంది. ఈ నిజాన్ని జిన్నాకు చెబుదాం అనుకునే లోపే.. ఆ సైకియాట్రిస్ట్ జిన్నా కు కాల్ చేసి ఎదో చెప్తాడు. కట్ చేస్తే జిన్నా చనిపోతుంది. అసలు ఆ సైకియాట్రిస్ట్ ఎందుకు ఈ లేడీస్ అందరిని చంపేస్తాడు ? జెన్నిఫర్ ను కూడా చనిపోతుందా! లేదా ఈ సైకియాట్రిస్ట్ గురించి నిజాలు అందరికి తెలిసేలా చేస్తుందా ! అసలు ఆ తర్వాత ఏమైంది? దీని నుంచి మిగిలిన అమ్మాయిలను జెన్నిఫర్ కాపాడగలుగుతుందా! ఇవన్నీ తెలియాలంటే “హిప్నటిక్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments