OTT Movie Suggestion: OTT లో మలయాళ ఫీల్ గుడ్ మూవీ.. అసలు మిస్ అవ్వొద్దు..

OTT Movie Suggestion: OTT లో మలయాళ ఫీల్ గుడ్ మూవీ.. అసలు మిస్ అవ్వొద్దు..

ఓటీటీ ల పుణ్యమా అని అన్ని భాషల చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా మలయాళీ సినిమాలకు మరింత ఆదరణ పెరిగిపోతుంది. మరి ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే మలయాళీ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ ల పుణ్యమా అని అన్ని భాషల చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా మలయాళీ సినిమాలకు మరింత ఆదరణ పెరిగిపోతుంది. మరి ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే మలయాళీ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

కేవలం మలయాళ సినిమాల కోసమే సెర్చ్ చేసే ప్రేక్షకులు కూడా ఉన్నారు. మలయాళ సినిమాల ఇంపాక్ట్ ప్రేక్షకుల మీద బాగానే పడుతుంది. ఒకప్పుడు ఒకటి రెండు మూడు మలయాళ సినిమాలను చూసి ఆహ ఓహో అంటూ సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అందరు ఈ సినిమాల కోసమే ఎదురుచూస్తున్నారు. వాటి కోసమే సెర్చ్ చేస్తున్నారు. ఓటీటీ ల పుణ్యమా అని అన్ని భాషల చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. మేకర్స్ కూడా ఇప్పడు ఓటీటీ లకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ఆయా సినిమాలను తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

అసలు సినిమా ఎలా ఉందొ చూడాలంటే.. కనీసం స్టోరీ లైన్ ఏంటో చూడాలి. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ప్రశాంత్ అనే ఓ కేరళ అబ్బాయి.. ముంబలో ఆయుర్వేదం షాప్ రన్ చేస్తుంటాడు. అతనిని అందరు పాచు అని పిలుస్తూ ఉండేవారు. అందరితో మంచిగా మాట్లాడుతూ.. తన పని తాను చేసుకుంటూ.. అందరికి తలలో నాలుకలా ఉండేవాడు. అయితే అనుకోకుండా ఓ రోజు ఆ షాప్ ఓనర్ అయినా రియాజ్ తల్లి ద్వారా.. పాచు కొన్ని ఇబ్బందులు పడతాడు. అయితే రియాజ్ తల్లి తనకు సహాయం చేస్తే ఆ ఆయుర్వేదం షాప్ రాసి ఇచ్చేస్తాను అని ఓ ఆఫర్ ఇస్తుంది. అసలే అతనికి డబ్బంటే ఇష్టం.. దీనితో కొంచెం రిస్క్ అయినా కూడా ఆ ఆఫర్ ను యాక్సెప్ట్ చేస్తాడు. ఇంతకీ ఆమెకు చేయాల్సిన సహాయం ఏంటంటే.. గోవాలో ఉంటున్న నిధి అనే అమ్మాయిని రియాజ్ తల్లి దగ్గరకు చేర్చాలి. ఆ ప్రయాణంలో పాచుకు ఎదురైన ఇబ్బందులు ఏంటి ? అసలు నిధి అనే అమ్మాయి ఎవరు ? సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి! అతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది ! ఇవన్నీ తెలియాలంటే “పాచువుమ్ అద్ఫుత విళక్కుం” అనే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్,అంజనా జయప్రకాశ్,ఇన్నోసెంట్,ధ్వని రాజేశ్,విజి వెంకటేశ్,వినీత్ ముఖ్య పాత్రలలో నటించారు. ఎలాంటి పెద్ద పెద్ద సస్పెన్స్ లైతే ఉండవు. సాఫీగా సాగిపోయే ఓ ఫీల్ గుడ్ మూవీ. రెగ్యులర్ మూవీస్ చూసి బోర్ కొట్టిన వారికీ.. కాస్త బ్రేక్ కావాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments