OTT Suggestion-Best Investigation thriller: సినిమా నిండా ట్విస్ట్ లు, మలుపులే .. OTT లో అదిరిపోయే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

సినిమా నిండా ట్విస్ట్ లు, మలుపులే .. OTT లో అదిరిపోయే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Crime investigation thriller: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ అన్ని చూసేందుకు ఒకేలా అనిపించినా కూడా.. ఒక్కోటి ఒక్కో విధంగా ఉంటూ ఉంటాయి. కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ ఏంటి ఈ మూవీని మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

OTT Crime investigation thriller: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ అన్ని చూసేందుకు ఒకేలా అనిపించినా కూడా.. ఒక్కోటి ఒక్కో విధంగా ఉంటూ ఉంటాయి. కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ ఏంటి ఈ మూవీని మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథలన్నీ కూడా చూడడానికి ఒకే ప్లాట్ లో ఉంటూ ఉంటాయి. కానీ పోలీసులు ఆ కేసును సాల్వ్ చేసే తీరు మాత్రం ఒక్కో మూవీలో ఒక్కో రకంగా ఉంటూ ఉంటుంది. కొన్ని సినిమాలలో ఏకంగా పోలీసులే మర్డర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ కేసునుంచి ఎలా తప్పించుకున్నారనే కాన్సెప్ట్.. మూవీ చివరి వరకు చూసేలా చేస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ఇది ఒక మలయాళ మూవీ.. ఇక మలయాళ మూవీస్ నుంచి వచ్చిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్.. ఇప్పటికే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి. మరి ఈ సినిమా ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారా లేదా… ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఓ దట్టమైన ఫారెస్ట్ ఏరియాలో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురైనట్లు చూపిస్తారు. దీనితో పోలీసులు రంగంలోకి దిగుతారు. అక్కడ దొరికిన కార్ , ఫోన్ ఆధారంగా.. ఆ డెడ్ బాడీ ఓ ప్రముఖ సినీ హీరో రవి వర్మదిగా పోలీసులు అనుమానిస్తారు. కానీ నిజానికి ఆ మృతదేహం రవి వర్మది కాదని.. అతని కార్ డ్రైవర్ బులెట్ రాజాదని తేలుతుంది. పైగా అతను మాత్రమే కాకుండా.. అతనితో పాటు మరొక పోలీస్ ఆఫీసర్ , లాయర్ , చర్చి ఫాదర్ కూడా అనుమానాస్పద రీతిలో హత్యకు గురవుతారు. దీనితో ఈ హత్యలన్నీ ఓ సీరియల్ కిల్లర్ చేస్తున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తారు. ఆ కిల్లర్ ను పట్టుకునే బాధ్యాతను ఐపీఎస్ ఆఫీసర్ విన్సీ అబ్రహం కు ఇస్తారు. ఆమె ఈ కేసును టెక్ అప్ చేసిన వెంటనే.. ఆ సైకో కిల్లర్ ఇరాటన్ చాకో అని విన్సీ అనుమానిస్తోంది. కానీ తనతో ఉన్న మరొక ఆఫీసర్ మాత్రం .. ఈ హత్యలు చేసింది మరొక కిల్లర్ అని ఆమెతో వాదిస్తూ ఉంటాడు.

మరి వారిలో ఎవరి మాట నిజమైంది ? అసలు ఆ హత్యలు చేస్తుంది ఎవరు ? వారిద్దరిలో అసలు హంతకుడిని ఎవరు పట్టుకున్నారు ? ఈ హత్యలకు పోలీసులకు ఏదైనా సంబంధం ఉందా? అసలు అక్కడ ఏం జరిగింది ! ఆ సైకో కిల్లర్స్ వీరిని కూడా ఏదైనా చేశాడా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా పేరు “పాప్పన్”. రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీలా మొదట అనిపించినా కానీ.. సినిమా చూస్తున్న కొద్దీ.. ఒక డిఫరెంట్ స్టోరీ అని అర్ధమౌతుంది. ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ , జీ5 లోను స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. మీ మైండ్ తో ఆడుకునే మలయాళ సినిమా.. OTT లో ఉంది చూశారా!

Show comments