Swetha
OTT Best Political Drama: స్టార్ హీరోయిన్స్ అంతా ఇప్పుడు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు చేసిన సినిమాలే కాకుండా.. ఇతర భాషలలో చేసిన ఎన్నో మంచి మంచి సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.
OTT Best Political Drama: స్టార్ హీరోయిన్స్ అంతా ఇప్పుడు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు చేసిన సినిమాలే కాకుండా.. ఇతర భాషలలో చేసిన ఎన్నో మంచి మంచి సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.
Swetha
ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చే సినిమాలలో కొత్త కొత్త యాక్టర్స్ కనిపిస్తూ ఉంటున్నారు. కానీ కొన్ని సినిమాలను చూస్తే.. ఈ యాక్టర్స్ ఇలాంటి సినిమాలను కూడా చేసారా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా గురించి విన్నా కూడా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. దాదాపు ఏ కొత్త సినిమా ఓటీటీ లోకి వచ్చినా కూడా ఆ సినిమాను అసలు వదిలిపెట్టకుండా చూస్తూ ఉంటారు. వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కూడా చూశారో లేదో ఓ లుక్ వేసేయండి. మరి ఈ సినిమా ఏంటో.. అసలు ఈ సినిమాలో నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు.. ఈ మూవీ స్టోరీ చూసేద్దాం.. ఎక్కడైనా చూసినట్లు ఉందేమో ఓ లుక్ వేసేయండి. ఈ మూవీ స్టోరీ ఏంటంటే.. కాశీపురం అనే ఓ ఊరు ఉండేది. ఆ ఊరికి ఎమ్మెల్యే గా వ్యవహరిస్తూ ఉంటాడు మామన్నన్ అనే వ్యక్తి . అయితే ఇతను వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి. అతని కొడుకు అదివీరన్ అభ్యుదయ భావాలున్న కుర్రాడు. ఇక మరోవైపు పేదల కోసం , పేద విద్యార్థుల కోసం ఓ కోచింగ్ సెంటర్ ను నడుపుతూ ఉంటుంది.. లీల అనే అమ్మాయి. అయితే ఆ ఊరి రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్ అన్నయ్య వలన లీల కు అనేక రకాల సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. దీనితో మామన్నన్ , అతని కొడుకు ఆదివీరన్ కలిసి రత్నవేల్ కు ఎదురు తిరుగుతారు. అతనిని ఎలా అయినా ఎదురించి.. అతని అధికారాన్ని అణగతొక్కాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో అనేక అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే.
ఈ సినిమా పేరు “మామన్నన్”. ఇందులో లీల పాత్రలో నటించింది మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. అలాగే ఆ ఊరి ఎమ్మెల్యే గా వడివేలు నటించగా.. రత్నవేల్ పాత్రలో ఫహద్ ఫాజిల్ నటించాడు. కథ కథనం కాస్త రొటీన్ గా అనిపించినా కూడా.. చూసేకొద్దీ ఈ సినిమా నచ్చుతుంది. రాజకీయ పరంగా ఉన్న ఈ సినిమా.. రొటీన్ గా ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. అసలు ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర ఏంటి ! కథ ఎలా ఉండబోతుంది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.