OTT Suggestion - Best Suspense Thriller : OTT లో లేడీ ఓరియెంటెడ్ బ్లాక్ బస్టర్ మూవీ.. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో!

OTT Movie Suggestion: OTT లో లేడీ ఓరియెంటెడ్ బ్లాక్ బస్టర్ మూవీ.. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో!

Best Suspense Thriller : లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చూడడానికి బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

Best Suspense Thriller : లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చూడడానికి బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ లో కొన్ని సినిమాలు చూసేందుకు మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటాయి. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోను లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చాలా తక్కువగా వచ్చినా కూడా.. ఈ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటూ ఉంటారు. ఇప్పటివరకు ఈ ప్లాట్ తో వచ్చిన సినిమాలన్నీ కూడా బాగానే సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు చెప్పుకునే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

డీసీ , మార్వెల్ చిత్రాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే మార్వెల్ లోని ఓ స్పెషల్ క్యారెక్టర్ ఆధారంగా.. బ్లాక్ విడో పేరుతో.. ఓ సూపర్ హీరో మూవీ రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాను.. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో … వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ తో కలిసి రూపొందించారు మేకర్స్. ఇక ఈ సినిమాకు కేట్ షార్ట్ ల్యాండ్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ తో పాటు.. తెలుగు , హిందీ , తమిళం , మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి సినిమాలను తెలుగులో చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి.. ఎంచక్కా ఈ సినిమాను కూడా చూసేయండి . టీటీకే

ఇక ఈ మూవీ కథ విషయానికొస్తే.. అటు ఇటుగా ఈ మూవీ ఎవెంజర్స్ సిరీస్ ను గుర్తుచేస్తుంది. రష్యా కు చెందిన ఓ విలన్.. అనాధ అమ్మాయిలను కిడ్నప్ చేసి… వారందరిని ఓ సైన్యంలా తయారు చేస్తాడు. అతను ఏం చెప్తే అదే చేసేలా వాళ్ళ బ్రెయిన్స్ ను మార్చేస్తాడు. ఇక ఆ తర్వాత అమెరికాలోని రహస్యాన్ని తెలుసుకునేందుకు.. ఒక ఫేక్ కుటుంబాన్ని సృష్టిస్తాడు. ఆ తర్వాత ఆ కుటుంబంలోని వారందరిని విడదీస్తాడు. ఈ క్రమంలో ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి ఈ విలన్ ను అంతం చేయాలనీ చూస్తుంది. అనుకున్నట్లుగానే.. తన స్నేహితులు కొంతమందితో కలిసి.. అతనిని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. అసలు అనాధ అమ్మాయిలనే ఎందుకు టార్గెట్ చేశాడు! అతని నుంచి వారిని కాపాడిందా లేదా! ఆ విలన్ ఎవరు ! ఇవన్నీ తెళియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments