Best Psyco Killer Movie In OTT: OTT లో బెస్ట్ సైకో కిల్లర్ మూవీ.. చనిపోయిన సైకో కిల్లర్ మళ్ళీ జన్మిస్తే !

Best Psyco Killer Movie In OTT: OTT లో బెస్ట్ సైకో కిల్లర్ మూవీ.. చనిపోయిన సైకో కిల్లర్ మళ్ళీ జన్మిస్తే !

OTT Movie Suggestion: ఇప్పటివరకు ఓటీటీలో ఎన్నో సైకో కిల్లర్ మూవీస్ చూసి ఉంటారు . కానీ, ఇలాంటి సినిమా మాత్రం అసలు చూసి ఉండరు, మరి ఆ సినిమా ఏంటో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion: ఇప్పటివరకు ఓటీటీలో ఎన్నో సైకో కిల్లర్ మూవీస్ చూసి ఉంటారు . కానీ, ఇలాంటి సినిమా మాత్రం అసలు చూసి ఉండరు, మరి ఆ సినిమా ఏంటో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

సినిమా అనగానే అందరికి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఏ గుర్తొస్తున్నాయి. ఈ క్రమంలో ఓ పక్క ఎప్పటికప్పుడు వచ్చే సినిమాలను , సిరీస్ లను చూస్తూనే.. మరో వైపు ఇంకా ఏమైనా మంచి సినిమాలు ఉన్నాయా అని సెర్చ్ చేసేస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు దీనిని కూడా దృష్టిలో ఉంచుకుని.. ప్రేక్షకుల కోసం సజ్జెషన్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇది కూడా అలాంటి ఓ సజ్జెషన్ ఏ. ఇప్పటివరకు ఓటీటీలో ఎన్నో సైకో కిల్లర్ మూవీస్ చూసి ఉంటారు . కానీ, ఇలాంటి సినిమా మాత్రం అసలు చూసి ఉండరు. సీట్ ఎడ్జ్ లో కుర్చోపెట్టే సినిమా ఇది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

సాధారణంగా పునర్జన్మలు ఉన్నాయని అందరు నమ్ముతారు. అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి పుడతారనే నమ్మకం. ఒకవేళ ఆ చనిపోయిన వ్యక్తి ఓ సైకోకిల్లర్ అయితే , అతను మళ్ళీ పుట్టినప్పుడు తనకు గతం అంతా గుర్తొస్తే.. ఎలా ఉంటుంది. అనేదే ఈ సినిమా . ఈ సినిమా స్టార్టింగ్ లో ఓ అమ్మాయి తన చేయి నరికేశారని ఏడుస్తూ… పోలీసులని ఆశ్రయిస్తుంది. దీనిని బట్టి ఆ పని చేసిన వ్యక్తి ఓ సైకో కిల్లర్ అని అర్ధం చేసుకుని.. అతనిని పట్టుకుని పోలీసులు అతనిని కాల్చేస్తారు. సరిగ్గా అదే సమయంలో సారా, జాన్ అనే దంపతులకు ఓ బాబు పుడతాడు. ఆ బాబు కు మైల్స్ అనే పేరును పెడతారు. అతను చిన్నప్పటినుంచే చాలా పెద్దవాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అర్ధరాత్రులు లేచి ఏవేవో మాట్లాడేవాడు. స్కూల్ కి వెళ్లి అక్కడ తన క్లాస్ మేట్స్ ను రాడ్ తో కొడతాడు. అలా ఎందుకు చేసావ్ అని అడిగితే.. తానూ అలా చేయకపోతే.. వేరే వ్యక్తి తనని కొడతాడని భయపడుతూ చెప్తాడు.

దీనితో వారికి ఏమి అర్థంకాక.. మైల్స్ ను ఓ సైక్రియాట్రిస్టు దగ్గరకు తీసుకుని వెళ్తారు. కానీ అక్కడ కూడా మైల్స్ డాక్టర్ ను బెదిరించి.. తనకు ఏ ప్రాబ్లమ్ లేదని తన తల్లికి చెప్పిస్తాడు. కానీ డాక్టర్ తో మాట్లాడుతున్న సమయంలో అతను సోఫాపై ఓ పేరును రాస్తాడు. దీనితో ఆ డాక్టర్ ఆ పేరును గూగుల్ చేయగా అది ఓ సైకో కిల్లర్ పేరు అని గుర్తిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? తన తల్లికి ఈ విషయం తెలిసిన తర్వాత.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?అసలు పునర్జన్మలు ఉంటాయా ! చివరికి ఈ కథ ఎలా ముగిసింది ! ఇవన్నీ తెలియాలంటే “ది ప్రాడిజీ” అనే ఈ సినిమాను చూడాల్సిందే . ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments