Swetha
35 Chinna Katha Kaadu Movie OTT Partner: నివేద థామస్ చాలా గ్యాప్ తర్వాత ఓ మంచి ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అదే 35 చిన్న కథ కాదు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఫిక్స్ అయిపొయింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.
35 Chinna Katha Kaadu Movie OTT Partner: నివేద థామస్ చాలా గ్యాప్ తర్వాత ఓ మంచి ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అదే 35 చిన్న కథ కాదు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఫిక్స్ అయిపొయింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.
Swetha
థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఎలా అయినా ఓటీటీ లోకి రావాల్సిందే. ఈ క్రమంలో కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కు ముందు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ ఫిక్స్ చేసుకుంటే కొన్ని సినిమాలు రిలీజ్ తర్వాత ఫిక్స్ చేసుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో గత వారం రిలీజ్ అయినా సినిమాలు విజయ్ నటించిన ది గోట్, నివేద థామస్ నటించిన 35 చిన్న కథ కాదు మూవీ. ఆల్రెడీ గోట్ మూవీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ గురించి చూసేసాం. ఇక ఇప్పుడు నివేద నటించిన 35 చిన్న కథ కాదు మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అప్ డేట్ కూడా వచ్చేసింది. మరి ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత ఏ ప్లాట్ ఫార్మ్ లోకి రానుందో చూసేద్దాం.
చాలా గ్యాప్ తర్వాత నివేద థామస్ నటించిన మూవీ 35 చిన్న కథ కాదు . ఈ సినిమా సెప్టెంబర్ 6 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. రిలీజ్ కు ముందే ఈ మూవీ ప్రేక్షకులలో ఓ రకమైన క్యూరియాసిటీని పెంచేసింది. గత నెలలో థియేటర్స్ లో చిన్న సినిమాలు ప్రేక్షకులలో బాగా బజ్ సంపాదించడంతో.. ఈ సినిమాపై కూడా అదే రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఇక రిలీజ్ తర్వాత ఈ మూవీ అలానే సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవ్వడం విశేషం. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ కూడా కన్ఫర్మ్ అయిపొయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకుంది. ఇక శాటిలైట్ హక్కులను జీ తెలుగు టీవీ ఛానెల్ దక్కించుకుంది. థియేట్రికల్ రన్ ను బట్టి .. త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్స్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
కాగా 35 చిన్న కథ కాదు సినిమాకు.. నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో నివేద థామస్ తో పాటు.. విశ్వదేవ్ , అనుదేవ్ పోతుల, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణతేజ, అభయ్, అనన్య ప్రధాన పాత్రలలో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై.. రానా దగ్గుబాటి సమర్పించడంతో.. ఇంకాస్త హైప్ నెలకొంది. తిరుపతి బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రతి ఒక్కరిని మెప్పించింది. మధ్య తరగతి కుటుంబాలల్లో జరిగే రోజు వారి సన్నివేశాలను.. ఎంతో సహజంగా మూవీలో చూపించి ప్రేక్షకుల మనసును దోచేశారు. దాదాపు ఇప్పుడు ప్రేక్షకులంతా కూడా ఇలాంటి కథలకే కనెక్ట్ అవుతున్నారు కాబట్టి.. మేకర్స్ కథ ను ఎంచుకున్న దగ్గరే సగం సక్సెస్ అయ్యారని చెప్పి తీరాల్సిందే. ఇక లాంగ్ రన్ లో ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.