నాని.. సరిపోదా శనివారం OTT పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే!

Saripodhaa sanivaaram Movie OTT Partner Locked: సినిమాలు ఇంకా థియేటర్ లో రిలీజ్ కాకముందే.. ఓటీటీ డీల్స్ ను ముగించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న నాని సరిపోదా శనివారం మూవీ ఓటీటీ డీల్ కూడా భారీ ధరలకు క్లోజ్ అయినట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Saripodhaa sanivaaram Movie OTT Partner Locked: సినిమాలు ఇంకా థియేటర్ లో రిలీజ్ కాకముందే.. ఓటీటీ డీల్స్ ను ముగించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న నాని సరిపోదా శనివారం మూవీ ఓటీటీ డీల్ కూడా భారీ ధరలకు క్లోజ్ అయినట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

థియేటర్ లో ఆయా సినిమాల టాక్ ఎలా ఉన్నా సరే.. ఓటీటీ లో మాత్రం ఆయా సినిమాలు అదరగొడుతున్నాయి. థియేటర్ లో రిలీజ్ అయినా నెల , రెండు నెలల వ్యవధిలోనే ఆయా సినిమాలు ఓటీటీ లోకి రావడం.. అలాగే స్ట్రీమింగ్ కు వచ్చిన కొద్దీ గంటల్లోనే ట్రెండింగ్ లోకి రావడం విశేషం . ఇక ఈ మధ్య కాలంలో సినిమాలు ఇంకా థియేటర్ లో రిలీజ్ కాకముందే.. ఓటీటీ డీల్ ముగుస్తుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయింది. అదే నాని సరిపోదా శనివారం మూవీ. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ భారీ ధరలకు అమ్ముడుపోయినట్లు సమాచారం. మరి ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఎదో చూసేద్దాం.

ఆగస్ట్ నెల అంతా కూడా అటు థియేటర్స్ , ఇటు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ .. మంచి మంచి మూవీస్ తో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ నెలలో ఆఖరిగా రిలీజ్ కు రెడీ గా ఉన్న మూవీ నాని నటించిన సరిపోదా శనివారం. ఇప్పటివరకు రిలీజ్ అయినా స్టార్ హీరోల సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోవడంతో.. ఇప్పుడు అందరి ఆశలు ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా ఆగస్ట్ 29న థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు సొంతం చేసుకుంది. అలాగే టెలివిజన్ హక్కులు తెలుగులో జీ తెలుగు సంస్థలు సొంతం చేసుకోగా.. హిందీ రైట్స్ ను కలర్స్ సినీ ప్లెక్స్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

సో మొత్తానికి నాని సరిపోదా శనివారం.. థియేటర్ రిలీజ్ కు ముందే.. నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్ ను డీసెంట్ ధరలకు క్లోజ్ చేసుకుందని చెప్పి తీరాలి. మూవీ రిలీజ్ కు ఇంకా కొంత సమయం మాత్రమే ఉండడంతో.. మూవీ టీం అంతా ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి సినిమాపై అందరికి భారీ అంచనాలు ఉన్నా కూడా. రిలీజ్ తర్వాత.. ఈ మూవీ అందరి అంచనాలను ఏ మేరకు నిలబెట్టుకుంటుందో చూడాలి. మరి ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments