ఈ వారం OTT లో ఈ 4 తెలుగు అసలు మిస్ కాకుండా చూడండి..

This Week Must Watch Telugu Movies In OTT: ప్రతి వారం ఓటీటీ లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో ఎక్కువగా తెలుగు సినిమాలకు ఆదరణ బాగా లభిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ వారం మాత్రం చాలా స్పెషల్.. మరి ఈ వారం మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలేంటో చూసేద్దాం.

This Week Must Watch Telugu Movies In OTT: ప్రతి వారం ఓటీటీ లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో ఎక్కువగా తెలుగు సినిమాలకు ఆదరణ బాగా లభిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ వారం మాత్రం చాలా స్పెషల్.. మరి ఈ వారం మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలేంటో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య తక్కువే అయినా కూడా.. వాటిలోనే థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినా సినిమాలు ఉన్నాయి. ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి ఈ సినిమాలు వస్తాయా అని ఎదురుచూసే సినిమాలు.. ఓటీటీ లోకి రానున్నాయి. ఇప్పటివరకు ఓటీటీ లోకి వచ్చిన అన్ని సినిమాలలో ఈ సినిమాలు చాలా సెప్షల్. మరి ఈ వారం ఓటీటీ లో అసలు మిస్ కాకుండా చూడాల్సిన తెలుగు సినిమాలేంటో.. అవి ఎక్కడ చూడాలి అనే విషయాలను చూసేద్దాం.

ఈ వారం అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే

కల్కి 2898AD :

నాగ్ అశ్విన్ సృష్టించిన అద్భుత ప్రపంచం కల్కి. ఈ సినిమా గురించి ఇప్పటికే కథలు కథలుగా వినేసాం. అలాగే ఈ సినిమా తర్వాత మహాభారతం కథలను కూడా చూసేశాం. దాదాపు ఈ సినిమాను థియేటర్ లో అందరూ చూసి ఉంటారు. కానీ ఎంతైనా ఓటీటీ లో కూడా చూడాలనే ఆశ ఉంటుంది. అలాగే థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీ లో చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ఆగస్ట్ 22 నుంచి హిందీ భాషలో నెట్ ఫ్లిక్స్ లో , అలాగే మిగిలిన అన్ని భాషలు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి.

రాయన్:

జూలై 26 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా కోలీవుడ్ లో రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ధనుష్ కెరీర్ లోనే తెలుగులో అత్యధిక థియేటర్స్ దక్కించుకున్న మూవీగా టాక్ సంపాదించుకుంది. అలాగే ఈ సినిమాను స్వయంగా ధనుష్ డైరెక్ట్ చేయడం.. అతని కెరీర్ లో 50 వ సినిమా అవ్వడం విశేషం. మరి ఇలాంటి సినిమాను థియేటర్ లో కనుక మిస్ అయ్యి ఉంటే.. వెంటనే ఓటీటీ లో చూసేయండి. ఈ సినిమా ఆగస్ట్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

విరాజి:

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన ఈ సినిమా ఆగస్ట్ 2 ‘విరాజి’ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా గురించి మాత్రం అంతగా టాక్ వినిపించలేదు. ఈ మధ్య ఎలాగూ థియేటర్ లో మెప్పించని సినిమాలు ఓటీటీ లో ఆకట్టుకుంటున్నాయి.. కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమా ఆగస్ట్ 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ సినిమాను కూడా ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేసుకోండి.

గర్‌ర్‌ర్:

కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గర్‌ర్‌ర్ సినిమా ఐదు రోజుల్లో రూ. 2.85 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ సృష్టించింది. జూన్ 14 న థియేటర్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్ట్ 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఎంచక్కా ఈ మలయాళీ సర్వైవల్ థ్రిల్లర్ ను .. తెలుగులో కూడా ఉంది కాబట్టి.. అసలు మిస్ కాకుండా చూసేయండి.

ప్రస్తుతానికి ఈ వారం ఓటీటీ లో అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే. వీకెండ్ అయ్యే లోపు మరి కొన్ని సినిమాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments