Swetha
Movie Makers New Plan For OTT Market: ఇప్పుడు ఓటీటీ మార్కెట్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. రోజు రోజుకి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ క్రేజ్ పెరిగిపోతుంది. దీనితో మూవీ మేకర్స్ కూడా ఓటీటీ కోసం కొత్త ఫార్ములాతో ముందుకు వచ్చేస్తున్నారు. అదేంటో చూసేద్దాం.
Movie Makers New Plan For OTT Market: ఇప్పుడు ఓటీటీ మార్కెట్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. రోజు రోజుకి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ క్రేజ్ పెరిగిపోతుంది. దీనితో మూవీ మేకర్స్ కూడా ఓటీటీ కోసం కొత్త ఫార్ములాతో ముందుకు వచ్చేస్తున్నారు. అదేంటో చూసేద్దాం.
Swetha
థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కాస్త ఆలస్యం అయినా ఓటీటీ లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడైతే దాదాపు నెలలోపే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలకు సంబంధించిన ఓటీటీ అప్ డేట్స్ కూడా చూస్తూనే ఉన్నాము. థియేటర్స్ లో సినిమాలను మిస్ అయిన వారు.. ఓటీటీ లో ఆ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఇక్కడ మరొక చిక్కు కూడా ఉంది. అదేంటంటే.. ఆల్రెడీ థియేటర్ లో చూసినా సినిమాను ఓటీటీ లో ఎందుకు చూడాలి అనేది మరి కొంతమంది ఆడియన్స్ ప్రశ్న. దీనితో మరి ఒక్కో సినిమాకు వందల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి అని.. ఓటీటీ ఓనర్స్ కూడా ఆలోచనలో పడ్డారు. అందుకోసం ఓటీటీ మార్కెట్ ను పెంచుకునేందుకు మూవీ మేకర్స్ ఓ కొత్త ఫార్ములాను కనుగొన్నారు. అదేంటో చూసేద్దాం.
ఇప్పుడంటే థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల్లోనే సినిమా ఓటీటీ లోకి వస్తుంది. కానీ , ఒకప్పుడు సినిమా అంటే కేవలం థియేటర్ లో చూడాల్సిందే. ఒకవేళ థియేటర్ లో మిస్ అయితే.. అది టీవీ లో వచ్చేంత వరకు వెయిట్ చేసేవారు. అయితే ఆ సమయంలో థియేటర్స్ లో కలెక్షన్స్ పెంచుకోవడానికి.. సినిమా విడుదలైన రెండు మూడు వారాల తరువాత కొత్త సాంగ్స్ యాడ్ చేయడం.. కట్ చేసిన సీన్స్ యాడ్ చేయడం లాంటివి చేసేవారు. దీనితో ప్రేక్షకులు కూడా వాటికోసం మళ్ళీ మళ్ళీ సినిమాలకు వెళ్లేవారు. ఇప్పుడు ఓటీటీ కోసం కూడా అదే ఫార్ములాను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం అసలు ఓటీటీ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. పైగా దీని వలన కలిగే వందల కోట్ల ఆదాయంతో నిర్మాతలకు అదనపు ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి మేకర్స్ కూడా అదే సినిమాను ఇవ్వకుండా.. ఓటీటీ కోసం సెపరేట్ ఎడిటెడ్ వెర్షన్స్ ను సిద్ధం చేస్తున్నారు.
ఇక థియేటర్ లో సినిమాలను చూసిన కొంతమంది ప్రేక్షకులు కూడా.. ఓటీటీ లో ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటే బావుంటుందేమో అనే భావనలో ఉంటున్నారు. సో వారి కోసం వెండి తెరపై చూపించని కొన్ని సీన్స్ ను బుల్లితెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ గత ఏడాది జవాన్ , లియో సినిమాల విషయంలో ఇదే జరిగింది. అదనపు సీన్స్ యాడ్ చేసి ఓటీటీ లో రిలీజ్ చేయడం వలన వ్యూయర్ షిప్ కూడా పెరిగింది. . యానిమల్ , అర్జున్ రెడ్డి సినిమాలకు సందీప్ రెడ్డి చేసింది కూడా ఇదే. ఇక ఇప్పుడు విజయ్ నటించిన గోట్ సినిమాను కూడా అదే తరహాలో ఓటీటీ లో అందుబాటులోకి తీసుకురానున్నారు మేకర్స్. సో ఇప్పుడు డైరెక్టర్స్ కట్ పేరుతో సరికొత్తగా ఓటీటీ వెర్షన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ప్రస్తుతం హనుమాన్ మూవీని .. ఇదే తరహాలో ఇంటర్నేషనల్ వెర్షన్ ఓటీటీ కోసం సిద్ధం చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. వీటితో పాటు మరిన్ని సినిమాలు ఇదే వెర్షన్స్ లో రానున్నట్లు సమాచారం. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.