OTTలోకి రానున్న మలయాళం 1000 బేబీస్ హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTTలోకి రానున్న మలయాళం 1000 బేబీస్ హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Malayalam Horror Web Series: హారర్ జోనర్ సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ కోసం ఇప్పుడు మలయాళం నుంచి సరికొత్త హారర్ వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రేక్షకుల ముందకు రాబోతుంది. అయితే తాజాగా ఈ సిరీస్ సంబంధించి మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ హారర్ వెబ్ సిరీస్ ఏంటీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Malayalam Horror Web Series: హారర్ జోనర్ సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ కోసం ఇప్పుడు మలయాళం నుంచి సరికొత్త హారర్ వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రేక్షకుల ముందకు రాబోతుంది. అయితే తాజాగా ఈ సిరీస్ సంబంధించి మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ హారర్ వెబ్ సిరీస్ ఏంటీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం హార్రర్ మూవీస్ కు, వెబ్ సిరీస్ కు ఉన్న క్రేజ్ మాములుగా లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఈ జోనర్ సినిమాలకు కథలకు చాలా డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా ఓటీటీ విషయానికొస్తే.. భాష ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్ కంటెంట్ ఉన్న సినిమాలైతే చాలు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే. వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ప్రేక్షకుల కోసం మరిన్నీ ఇంట్రెస్టింగ్ హారర్ సినిమాలను తీసుకుచ్చే విధంగా ప్లాన్ చేస్తుంటారు. ఈ మేరకు తాజాగా మలయాళం నుంచి సరికొత్త హారర్ వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రేక్షకుల ముందకు రాబోతుంది. అయితే తాజాగా ఈ సిరీస్ సంబంధించి మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ హారర్ వెబ్ సిరీస్ ఏంటీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా మలయాళం నుంచి సరికొత్త హారర్ వెబ్ సిరీస్ రాబోతుంది. మరీ ఆ సిరీస్ పేరే ‘1000 బేబీస్’. ఇక ఈ సిరీస్ లో రెహమాన్, నీనా గుప్తా లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి మేకర్స్ బుధవారం (ఆగస్ట్ 14) రాత్రి కొత్త అప్డేట్ ను ప్రకటించారు. కాగా, ఈ 1000 బేబీస్ సిరీస్ నుంచి ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలాగే హారర్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ వెబ్ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. ఇక 1000 బేబీస్ సిరీస్ పోస్టర్ ను గమనించినట్లయితే.. ఇదొక హారర్ డ్రామాగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆ పోస్టర్ లో ఓ అడవిలోని చూట్టు చెట్లు.. ఆ మధ్య ఉన్న ఉయ్యాలో ఓ పాప కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ పోస్టర్ బట్టి ఇదొక మంచి థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ అని చెప్పయవచ్చు. ఇకపోతే ఈ 1000 బేబీస్ వెబ్ సిరీస్ లో సంజూ శివరామ్, ఆదిల్, జాయ్ మాథ్యూ, శ్రీకాంత్ మురళీ, అశ్విన్ కుమార్, ఇర్షాద్ అలీ కూడా నటించారు.

అయితే ఈ 1000 బేబీస్ వెబ్ సిరీస్ నజీమ్ కోయా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సిరీస్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, పలు సీజన్ల పాటు వస్తూనే ఉంటుందని సిరీస్ నిర్మాత ఆగస్ట్ సినిమాకు చెందిన షాజీ నటేషన్ అన్నాడు. అంతేకాకుండా..ఈ సిరీస్ మొత్తంగా 210 నిమిషాల పాటు ఉంటుందని తెలిపాడు. అనగా మూడున్నర గంటలు ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.  ఇకపోతే ఈ సిరీస్ కు  స్ట్రీమింగ్ తేదీ మాత్రం ప్రకటించలేదు.  త్వరలోనే ఈ విషయం అధికారకంగా మేకర్స్ ప్రకటించనున్నారు. మరీ, త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతున్న 1000 బేబీస్ హారర్ వెబ్ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments