Maidaan OTT: సైలెంట్ గా OTT లో స్ట్రీమింగ్ అవుతున్న మైదాన్.. కానీ ఓ కండిషన్‌

కొన్ని సినిమాలు,సిరీస్ లు విపరీతమైన బజ్ తో ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంటే... కొన్ని సినిమాలు మాత్రం సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలానే సైలెంట్ గా స్ట్రీమింగ్ అయిపోతుంది.

కొన్ని సినిమాలు,సిరీస్ లు విపరీతమైన బజ్ తో ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంటే... కొన్ని సినిమాలు మాత్రం సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలానే సైలెంట్ గా స్ట్రీమింగ్ అయిపోతుంది.

థియేటర్ లో సినిమాల సందడి తగ్గిపోయింది కాబట్టి.. ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీ వైపే మళ్లింది. ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి కొత్త సినిమాలు వస్తాయా అని మూవీ లవర్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ కూడా దానికి తగినట్టుగానే ప్లాన్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించేందుకు కొత్త కంటెంట్ తో ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ వారం అనేక సినిమాలు, సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ సినిమా మాత్రం సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా మరేదో కాదు.. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ బయోపిక్ మూవీ.. మైదాన్. ప్రస్తుతం ఓటీటీ లో బయోపిక్ సినిమాలకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమాను హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ రహీం జీవితాన్ని ఆధారంగా తీసుకుని.. మైదాన్ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఇక ఈ సినిమాలో సయ్యద్ రహీమ్ పాత్రను అజయ్ దేవగణ్ నటించి.. ప్రేక్షకులను మెప్పించారు .ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించగా.. అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 10 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.అయితే ప్రస్తుతం ఈ సినిమా రెంటల్ బేసిస్ లో మాత్రమే అందుబాటులో ఉంది. జూన్ 1 నుంచి ఈ సినిమాను ఫ్రీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సమాచారం.

ఇక మైదాన్ సినిమా కథ విషయానికొస్తే.. 1950 లో ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ గా రహీం సెలెక్ట్ అవుతాడు. అయితే రహీం ను ఫుట్ బాల్ కోచ్ గా నియమించడం.. అక్కడ ఉన్న కొంతమంది బెంగాల్ వారికి నచ్చదు, దీనితో అతనిపై అనేక కుట్రలు పన్నుతారు. అలా అనేక కుట్రలు పన్ని రహీమ్ కోచ్ పదవి పోయేలా చేస్తారు. ఆ తర్వాత రహీమ్ ఏం చేస్తాడు. ఆ సమస్యల నుంచి ఎలా బయటపడతాడు. తిరిగి కోచ్ గా తానూ ఎలా నియమితుడయ్యాడు. తనకు వచ్చే అడ్డంకులను దాటుకుని.. ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ ఏషియన్ గేమ్స్ లో పతాకాన్ని ఎలా గెలుపొందాడు అనేదే ఈ సినిమా కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments