ఈరోజు OTT లో 8 సినిమాలు.. వాటిలో 5 తెలుగు సినిమాలే.. అసలు మిస్ కాకండి

Today Telugu Movies In OTT: సాధారణంగా థియేటర్ లో సినిమాలన్నీ కూడా శుక్రవారం రోజునే రిలీజ్ అవుతూ ఉంటాయి. దీనితో ఓటీటీ లో కూడా దాదాపు అలానే శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ వారం మాత్రం ఓ రోజు ముందుగానే ఓటీటీ లో సందడి మొదలైంది. ఈరోజు ఒక్కరోజే ఓటీటీ లో 8 సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి అవేంటో చూసేద్దాం.

Today Telugu Movies In OTT: సాధారణంగా థియేటర్ లో సినిమాలన్నీ కూడా శుక్రవారం రోజునే రిలీజ్ అవుతూ ఉంటాయి. దీనితో ఓటీటీ లో కూడా దాదాపు అలానే శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ వారం మాత్రం ఓ రోజు ముందుగానే ఓటీటీ లో సందడి మొదలైంది. ఈరోజు ఒక్కరోజే ఓటీటీ లో 8 సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి అవేంటో చూసేద్దాం.

ఈ వారం మొత్తం ఓటీటీ లో డిఫరెంట్ ప్లాట్ ఫార్మ్స్ లో ఇరవైకి పైగానే సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. అయితే సాధారణంగా థియేటర్స్ లో శుక్రవారం మాత్రమే సినిమాలు ,సిరీస్ లు ఎలా రిలీజ్ అవుతాయో.. ఓటీటీ లో కూడా అలానే దాదాపు సినిమాలన్నీ శుక్రవారమే స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం కాస్త స్పెషల్ ఎందుకంటే.. ఈ వారం ఓటీటీ లో సందడి ఓ రోజు ముందుగానే మొదలైపోయింది. ఈరోజు ఒక్కరోజే ఓటీటీ లో మొత్తం 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పైగా వాటిలో 5 తెలుగు సినిమాలే ఉండడం విశేషం . కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూడండి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈరోజు ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసిన సినిమాలు , సిరీస్ లు ఇవే

నెట్‌ఫ్లిక్స్ :

  • ఆయ్ (తెలుగు మూవీ)- సెప్టెంబర్ 12
  • మిస్టర్ బచ్చన్ (తెలుగు మూవీ)- సెప్టెంబర్ 12
  • బ్రేకింగ్ డౌన్ ది వాల్ (డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12
  • ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4 పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
  • మిడ్‌నైట్ ఎట్ ది పెరా ప్యాలెస్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

ఈటీవీ విన్ :

  • కమిటీ కుర్రోళ్లు (తెలుగు మూవీ)- సెప్టెంబర్ 12

అమెజాన్ ప్రైమ్ :

  • భీమా (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబర్ 12

సోనీ లివ్:

  • బెంచ్ లైఫ్ (తెలుగు వెబ్ సిరీస్)-సెప్టెంబర్ 12

ఇక ఈ సినిమాలు కాకుండా శుక్రవారం కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చిన్న సినిమాలుగా థియేటర్ లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించిన.. ఆయ్ , కమిటీ కుర్రాళ్ళు మూవీ చూసేందుకు ప్రేక్షకులు మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా గోదావరి బ్యాక్డ్రాప్ తో వచ్చి.. ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ ను కావాలనుకుంటున్నారో.. అలాంటి కంటెంట్ ను ఇచ్చి సక్సెస్ సాధించాయి. ఇక ఆ తర్వాత యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ పై అందరి ఫోకస్ ఉంది. కమిటీ కుర్రాళ్ళు సక్సెస్ తర్వాత.. నిహారిక ప్రొడ్యూస్ చేస్తున్న సిరీస్ ఇది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి.

ఇక రవి తేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ విషయానికొస్తే.. భారీ అంచనాల మధ్యన థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఊగించని విధంగా బోల్తా కొట్టింది. అయితే ఈ మధ్య థియేటర్ లో డిజాస్టర్ అయినా సినిమాలు కూడా.. ఓటీటీ లో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు మంచి వ్యూస్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ నాలుగు తెలుగు సినిమాలతో పాటు.. మరొక కన్నడ మూవీ భీమా.. తెలుగు డబ్బింగ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కాబట్టి ఈ రోజు స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఈ 5 తెలుగు సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments