OTTలో తెలుగులో ఉన్న బెస్ట్ 6 వెబ్ సిరీస్లు ఇవే.. వీటిని మిస్ చేశారా?

Best Telugu web Series in OTT: వెబ్ సిరీస్ లను ఈ మధ్య బాగా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అందులోను ఆయా వెబ్ సిరీస్ లు తెలుగులో ఉంటే ఇంకాస్త క్యూరియాసిటీ పెరిగిపోతుంది. మరి ఓటీటీ లో తెలుగులో ఉన్న బెస్ట్ వెబ్ సిరీస్ లు ఏంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఈ సిరీస్ లను మీరు చూశారో లేదో ఓ సారి చెక్ చేసేయండి .

Best Telugu web Series in OTT: వెబ్ సిరీస్ లను ఈ మధ్య బాగా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అందులోను ఆయా వెబ్ సిరీస్ లు తెలుగులో ఉంటే ఇంకాస్త క్యూరియాసిటీ పెరిగిపోతుంది. మరి ఓటీటీ లో తెలుగులో ఉన్న బెస్ట్ వెబ్ సిరీస్ లు ఏంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఈ సిరీస్ లను మీరు చూశారో లేదో ఓ సారి చెక్ చేసేయండి .

ప్రతి వారం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. వాటిలో తెలుగు సినిమాలు ఎమున్నాయా అనే సెర్చ్ చేస్తూ ఉంటారు. దీనితో ఆల్రెడీ ముందు ఒరిజినల్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసినా కానీ.. వాటిని తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. అందరూ ఈ మధ్య వెబ్ సిరీస్ లను మరింత ఇంట్రెస్టింగ్ చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎలాంటి వెబ్ సిరీస్ ఓటీటీ లోకి వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. మరి ఓటీటీ లో తెలుగులో ఉన్న ఈ బెస్ట్ వెబ్ సిరీస్ లను కానీ మీరు మిస్ చేశారేమో.. అవేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో.. ఓసారి చెక్ చేసేయండి .

త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్:

ఈ సిరీస్ పేరు చూసి.. ఎదో ఇన్స్పిరేషనల్ మూవీ అనుకుంటే పొరపాటే. ఇదొక క్రైమ్ కామెడీ రొమాంటిక్ సిరీస్.. ఈ సిరీస్ మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటుంది. సిరీస్ లో హీరో సిఏ టాపర్ ఏ కానీ.. సరైన జాబ్ లేక డబ్బులు చాలాకా మేల్ సె*క్స్ వర్కర్ గా మారతాడు. ఆ తర్వాత ఏమైంది.. ఎలాంటి పరిణామాలను ఎదురుకోవాల్సి వచ్చింది అనేదే ఈ సిరీస్. ఈ సిరీస్ ను ఒంటరిగా చూడడం బెటర్. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో అందుబాటులో ఉంది.

బృంద :

రీసెంట్ గా వచ్చిన టాప్ థ్రిల్లర్ తెలుగు సిరీస్ లిస్ట్ లో.. ఈ సిరీస్ ముందుంటుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో చివరి వరకు ఎంగేజింగ్ గా సాగిపోతుంది. ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్క ఎపిసోడ్ కూడా అసలు బోర్ కొట్టదు. నార్మల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా కాకుండా.. ప్రతి ఎపిసోడ్ లో కూడా ఒక సస్పెన్స్ ఎలిమెంట్ కచ్చితంగా ఉంటుంది. కొన్ని సీన్స్ చూసేటప్పుడు మాత్రం కాస్త ధైర్యం తెచ్చుకోవాలి. ఈ తెలుగు సిరీస్ ప్రస్తుతం సోనీలివ్ లో అందుబాటులో ఉంది.

3 బాడీ ప్రాబ్లమ్:

గేమ్ ఆఫ్ థ్రోన్స్ క్రియేటర్ చేసిన సిరీస్ ఏ ఈ 3 బాడీ ప్రాబ్లమ్స్ . కాబట్టి ఈ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లవర్స్ కు కచ్చితంగా నచ్చేస్తుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ సాగిపోతుంది. సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ నచ్చేవాళ్లకు ఈ సిరీస్ బెస్ట్ ఛాయస్. ఈ సిరీస్ వన్ లైన్ స్టోరీ ఏంటంటే.. వరల్డ్ లో టాప్ సైంటిస్ట్ లు సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు. చనిపోయే ముందు చేతిపై ఎదో నెంబర్స్ రాసుకుంటారు. అసలు వారు ఎందుకు చనిపోయారు.. రీజన్ ఏంటనేది కథ. కానీ ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

గుటర్ గు:

రెగ్యులర్ గా యాక్షన్ డ్రామాస్ చూసి.. బోర్ కొట్టేసి మైండ్ కు రిలాక్స్ అనిపించే ఏదైనా స్టోరీ చూడాలంటే ఈ సిరీస్ బెస్ట్ ఛాయస్. ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటుంది. ఈ సిరీస్ చూస్తే కచ్చితంగా అందరికి వాళ్ళ వాళ్ళ ఫస్ట్ లవ్ , స్కూల్ డేస్ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. కాబట్టి ఎంచక్కా ఎంజాయ్ చేసేయొచ్చు. ఈ సిరీస్ అమెజాన్ మినీ టీవీ లో ఫ్రీ గా తెలుగులో చూసేయొచ్చు.

శేఖర్ హోమ్:

రీసెంట్ గా ఓటీటీ లోకి వచ్చిన డిటెక్టీవ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. షెర్లాక్ హోమ్ కథలు నచ్చేవాళ్లకు ఈ సిరీస్ బాగా నచ్చేస్తుంది. ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ లు ఉంటాయి. అక్కడక్కడ కాస్త కంఫ్యూజింగ్ అనిపిస్తుంది కానీ.. ప్లాట్స్ ను అర్ధం చేసుకుని.. చూస్తే మాత్రం థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. కాబట్టి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసేయండి. ఈ సిరీస్ ప్రస్తుతం జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

సోలో లెవెలింగ్:

ఈ సిరీస్ స్టార్ట్ చేస్తే.. కంప్లీట్ అయ్యే వరకు ఎక్కడికి కదలరు. ఈ సిరీస్ మొత్తం 12 ఎపిసోడ్స్ ఉంటుంది. యాక్షన్ సిక్వెన్సెస్ , యానిమి మూవీస్ ను ఇష్టపడే వారికి.. ఈ సిరీస్ మంచి ఎక్స్పీరియెన్స్ ను ఇస్తుంది. సడెన్ గా ఎర్త్ మీద డిఫరెంట్ ప్లేసెస్ లో కొన్ని పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. అవన్నీ వేరే వరల్డ్ కి కనెక్ట్ అవుతాయి. అందులో నుంచి మోన్స్టర్స్ ఈవిల్స్ వస్తాయి.. ఆ తర్వాత ఏమైంది అనేదే ఈ కథ. ఈ సిరీస్ క్రంచిరోల్ అనే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకూ ఈ సిరీస్ ను చూడకపోతే కనుక వెంటనే చూసేయండి.

మరి ఈ సిరీస్ లలో మీరు కానీ ఏదైనా మిస్ అయితే వెంటనే చూసేయండి. ఈ సిరీస్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments