Lampan OTT: OTT లో ప్రతిఒక్కరి బాల్యాన్ని గుర్తుచేసే కొత్త వెబ్ సిరీస్ .. ఎక్కడ చూడాలంటే !

ఓటీటీ లోకి కొత్త కంటెంట్ వచేస్తుంది. ఒకటి రెండు సినిమాలు కాదు వారానికి పదుల సంఖ్యలో కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక కొత్త వెబ్ సిరీస్ ఓటీటీ లోకి రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓటీటీ లోకి కొత్త కంటెంట్ వచేస్తుంది. ఒకటి రెండు సినిమాలు కాదు వారానికి పదుల సంఖ్యలో కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక కొత్త వెబ్ సిరీస్ ఓటీటీ లోకి రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మూవీ లవర్స్ కు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా లేదా వెబ్ సిరీస్. ఇక ఇప్పుడు సినిమాలకంటే కూడా మేకర్స్ ఎక్కువగా దృష్టి పెడుతున్నది మాత్రం వెబ్ సిరీస్ లపైనే. ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన వెబ్ సిరీస్ లు అన్నీ కూడా ఒక దానిని మించి ఒకటి ఉంటున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెబ్ సిరీస్ లకు కూడా భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. పైగా కొన్ని వెబ్ సిరీస్ లను ప్రముఖులు రచించిన పుస్తకాలను ఆధారంగా తీసుకుని మరి.. రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరొక సరికొత్త వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటి ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ వెబ్ సిరీస్ మరేదో కాదు.. ప్రముఖ మరాఠి రచయిత ప్రకాష్ నారాయణ్ సంత్ రచించిన.. వనవాస్ అనే పుస్తకం నుంచి లంపన్ అనే పాత్రతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ పేరు “లంపన్”. ఈ వెబ్ సిరీస్ ను నిపుణ్ అవినాష్ ధర్మాధికారి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పటినుంచి కూడా దీనికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోని లివ్ లో మే 16 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరాఠితో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ఇక ఈ వెబ్ సిరీస్ లో లంపన్ అనే ఓ బాలుడి అనుభవాలను చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. కాగా లంపన్ పాత్రను బాలనటుడు మిహిర్ గోడ్ బోలె నటించగా.. చంద్రకాంత్ కులకర్ణి, గీతాంజలి కులకర్ణి, కాదంబరి సదమ్, పుష్కరాజ్ చిర్పుక్టర్, అవని భావే కూడా ప్రధాన పాత్రలలో నటించారు. 1947 కాలం నాటి బ్యాక్డ్రాప్ తో.. ఓ చిన్న గ్రామంలో ఈ సిరీస్ కథ కొనసాగుతుంది. రంగ్ గోడ్‍బోలే, హృషికేశ్ దేశ్‍పాండే, అమిత్ పత్వర్ధన్, చింతామని వత్రక్ కలిసి ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. మరి ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత ఏంటి అనే విషయానికొస్తే..

ఈ వెబ్ సిరీస్ కథేంటంటే.. లంపన్ అనే బాలుడు పుణె పట్టణంలో నివసిస్తూ ఉంటాడు. అయితే అతను హఠాత్తుగా గ్రామంలో ఉండే తన నానమ్మ , తాతయ్య దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. అదే గ్రామంలో ఓ స్కూల్ లోనే జాయిన్ అవుతాడు. ఇక అక్కడి నుంచి అతనికి కొత్త జీవితం మొదలవుతుంది. కొత్త స్నేహితులు, కొత్త ఊరు.. అక్కడి పరిస్థితులను లంపన్ ఎలా ఎదుర్కున్నాడు అనే నేపథ్యంతో ఈ సిరీస్ కథ ముందుకు సాగుతుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఖచ్చితంగా ఈ సిరీస్ ప్రతి ఒక్కరికి వారి బాల్యాన్ని గుర్తుచేస్తుంది. పైగా ఫ్యామిలీ అంతా కలిసి ఈ సిరీస్ ను చూడొచ్చు. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments