Swetha
సినిమాలు ఇంకా థియేటర్ లో రిలీజ్ కాకముందే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్.. భారీ ధరలకు ఆ మూవీ హక్కులను కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కుభేర OTT డీల్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు సమాచారం. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ , అక్కినేని నాగార్జున , రష్మిక ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న మూవీ ‘కుభేర’. ఈ సినిమా మీద ఇప్పటికే అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు ఈ మూవీ షూటింగ్ పనులు పూర్తయినట్లే. ప్రస్తుతం మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజిగా ఉంది. త్వరలోనే దీనికి సంబందించిన మరిన్ని అప్డేట్స్ ను మూవీ టీం అనౌన్స్ చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ ఇంకా రిలీజ్ కాకముందే.. నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరలకు అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది.
ఈ మధ్య కాలంలో చాలా OTT ప్లాట్ ఫార్మ్స్ సినిమాలో మంచి కంటెంట్ ఉంది అని భావిస్తే.. రిలీజ్ కు ముందే OTT డీల్ ను ముగించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏకంగా రూ.50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. అయితే ఈ రైట్స్ ఏ OTT ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకుంది అనే విషయం మాత్రం ఇంకా తెలియదు. ఈ రేంజ్ లో డీల్ సెట్ అవ్వడంతో సినిమాపై ఇంకాస్త అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ పాన్ ఇండియా మూవీ ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. త్వరలోనే ఈ మూవీకి సంబందించిన మరిన్ని విషయాలు బయటకురానున్నాయి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.