Swetha
వెబ్ సిరీస్ ల ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తుంది. బాగా హిట్ అయిన వెబ్ సిరీస్ లకు వరుసగా సరికొత్త సీజన్స్ ను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 కు సంబంధించిన అప్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.
వెబ్ సిరీస్ ల ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తుంది. బాగా హిట్ అయిన వెబ్ సిరీస్ లకు వరుసగా సరికొత్త సీజన్స్ ను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 కు సంబంధించిన అప్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.
Swetha
ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తుంది. చాలా మంది ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లను చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనితో మేకర్స్ కూడా.. కొన్ని పాపులర్ వెబ్ సిరీస్ లకు వరుస సీజన్స్ ను ప్రకటిస్తున్నారు. ఇంకా దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా సరికొత్తగా చేస్తున్నారు. మారుతున్న ఓటీటీ ల ట్రెండ్ కు తగినట్టుగానే మేకర్స్ కూడా అటు కంటెంట్ లోను ఇటు ప్రమోషన్స్ లోను కొత్తదనం కనబరుస్తున్నారు. ఈ క్రమంలో బాగా పాపులర్ అయినా వెబ్ సిరీస్ లలో ఒకటి కోటా ఫ్యాక్టరీ.. ఇప్పుడు ఈ సిరీస్ కు సరికొత్త సీజన్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సీజన్ ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఈ సిరీస్ మొదటి సీజన్ 2019 లో వచ్చింది. ఇక రెండవ సీజన్ 2021 లో వచ్చింది. ఇక ఇప్పుడు మూడేళ్ళ తర్వాత ఈ సిరీస్ మూడవ సీజన్ రాబోతుంది. ఇది ఐఐటీ ఆస్పిరెంట్స్ చుట్టూ తిరిగే కథ. రాజస్థాన్ లోని కోట ఐఐటీలలో సీటు సాధించడం కోసం నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈ కోచింగ్ కు పెట్టింది పేరు. అయితే అక్కడ కోచింగ్, ర్యాంకుల వెనుక పరుగులు ఈ ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది విద్యార్థులు. సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. దీనిని ప్రశ్నిస్తూనే ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఇక సీజన్ 3 కి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. “ఇక విజయం కోసం సిద్ధం కావడం కాదు.. సిద్ధమవడమే విజయం” అంటూ జీతూ భయ్యా ఓ పాడ్ కాస్ట్ లో చెప్పే డైలాగ్స్ తో ఈ సిరీస్ ట్రైలర్ మొదలవుతుంది.
ఈ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ అయినా వైభవ్ , అతని ఫ్రెండ్స్ తమ ఐఐటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ చాలా ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ జీవితాలలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేది చూపించారు. ఇక ఈ సీజన్ స్ట్రీమింగ్ డేట్ ను నేరుగా అనౌన్స్ చేయకుండా.. ప్రేక్షకులకే పని పెట్టింది. ఆ పజిల్ లో జూన్ 20 అని అందరు బాగానే గెస్ చేసేసారు. అంటే ఈ సరికొత్త సీజన్ జూన్ 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సిరీస్ పై.. మరిన్ని అంచనాలను పెంచేసింది. మరి ఈ సిరీస్ కు సంబంధించిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.