Swetha
OTT Horror Web Series- Agatha All Along: హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు. ఈ జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా.. ప్రతిదీ దేనికదే డిఫరెంట్ గా ఉంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ సిరీస్ వచ్చేసింది. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
OTT Horror Web Series- Agatha All Along: హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు. ఈ జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా.. ప్రతిదీ దేనికదే డిఫరెంట్ గా ఉంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ సిరీస్ వచ్చేసింది. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
Swetha
థియేటర్స్ లో అయినా.. ఓటీటీ లో అయినా హర్రర్ సినిమాలకు ఉండే క్రేజ్ ఏ వేరు. అందులోను హర్రర్ ఫాంటసీ హర్రర్ థ్రిల్లర్స్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు. ఈ జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. ప్రేక్షకులు అసలు మిస్ చేయకుండా చూస్తూ ఉంటారు. పైగా వచ్చిన ప్రతి సినిమా కూడా దేనికదే డిఫరెంట్ గా ఉంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీ లోకి వచ్చేసింది. మార్వెల్ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలు , సిరీస్ లకు మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా ఈ యూనివర్స్ నుంచి వచ్చిందే. మరి ఈ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ సిరీస్ పేరు ‘అగాథ ఆల్ ఎలాంగ్’. ఈ సిరీస్ ను మార్వెల్ టెలివిజన్ అనే కొత్త ప్రొడక్షన్ బ్యానర్స్ పై ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పటివరకు మార్వెల్ నుంచి వచ్చిన మూవీస్ , సిరీస్ అన్ని కూడా సూపర్ హిట్ సాధించాయి. ఇక ఇప్పుడు ఈ సిరీస్ ను నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేశారు మేకర్స్. ఇది మార్వెల్ నుంచి వస్తున్న తొలి హర్రర్ వెబ్ సిరీస్ కావడం విశేషం. ఈ సిరీస్ అంతా కూడా అగాధ అనే మంత్ర గత్తే చుట్టూ తిరుగుతుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇది 11వ వెబ్ సిరీస్. అగాధ పాత్రను మొదట వాండా విజన్ అనే వెబ్ సిరీస్ లో చూసే ఉంటారు. ఇప్పడు ఆ పాత్రతో ఏకంగా ఓ సెపరేట్ వెబ్ సిరీస్ నే తీసుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సిరీస్ ప్రస్తుతానికి ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలో తెలుగులో కూడా వచ్చే అవకాశం లేకపోలేదు.
ఇక ప్రస్తుతానికి ఈ వెబ్ సిరీస్ నుంచి కేవలం రెండు ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సిరీస్ లో మొత్తంగా 9 ఎపిసోడ్స్ ఉండగా అక్టోబర్ చివరి వారం నాటికి పూర్తి వెబ్ సిరీస్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ మూవీ కథ విషయానికొస్తే.. అగాధ అనే విచ్ అంటే మంత్రగత్తె తాను కోల్పోయిన స్పెల్స్ అంటే మంత్రాల ద్వారా వచ్చే పవర్స్ ను దక్కించుకోవడానికి.. విచ్ రోడ్ కు వెళ్తుంది. అలా వెళ్లేందుకు ఆమెకు టీన్ అనే ఒక కుర్రాడు సహాయం చేస్తాడు. అయితే ఈ సిరీస్ లో ఇలా చాలా మంది విచెస్ ఉంటారు. వారంతా ఒక చోటకు చేరుకుంటారు. అక్కడ వారంతా ఏం చేస్తారు ? టీన్ అనే కుర్రాడు ఎవరు ? ఎందుకు ఆమెకు హెల్ప్ చేస్తాడు ? అగాధ అసలు ఎలా తన శక్తులను కోల్పోతుంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.