IMDBలో హైయెస్ట్ రేటింగ్ పొందిన టాప్ 6 మూవీస్.. ఏ OTT లో ఉన్నాయంటే !

Top 6 Highest IMDB Rated Movies In OTT: ప్రస్తుతం ఓటీటీ లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. మరి ఇన్ని సినిమాలలో ఏ సినిమా బావుంటుంది.. ఏ సినిమా చూడాలి అనే కన్ఫ్యూషన్ ఉంటుంది మూవీ లవర్స్ కు. ఈ క్రమంలో ఇప్పుడు ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో హైయెస్ట్ రేటింగ్ పొందిన టాప్ 6 మూవీస్ ఏంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

Top 6 Highest IMDB Rated Movies In OTT: ప్రస్తుతం ఓటీటీ లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. మరి ఇన్ని సినిమాలలో ఏ సినిమా బావుంటుంది.. ఏ సినిమా చూడాలి అనే కన్ఫ్యూషన్ ఉంటుంది మూవీ లవర్స్ కు. ఈ క్రమంలో ఇప్పుడు ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో హైయెస్ట్ రేటింగ్ పొందిన టాప్ 6 మూవీస్ ఏంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ప్రతి వారం ఓటీటీ లో ఏ సినిమాలు ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవుతున్నాయో.. వాటిలో ఏ సినిమాలను మిస్ చేయకుండా చూడాలో ఎప్పటికప్పుడు లిస్ట్ వస్తూనే ఉంది. పైగా ఆల్రెడీ ఉన్న సినిమాలలో ఏ సినిమాలు బావుంటాయి అనే సజ్జెషన్స్ కూడా వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓటీటీ లో లెక్కకు మించిన సినిమాలు , సిరీస్ లు ఉన్నాయి కాబట్టి.. ప్రేక్షకులకు ఏ సినిమా చూడాలి .. ఏ సినిమా బావుంటుంది అనే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అప్పుడు అందరు రేటింగ్ బేస్డ్ గా మూవీస్ ను సెలెక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో హైయెస్ట్ రేటింగ్ పొందిన టాప్ 6 మూవీస్ ఏంటో.. ఆ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

సినిమా కథను బట్టి ఎప్పటికప్పుడు ప్రేక్షకులు రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఎక్కువ మంది IMDB రేటింగ్ ను చూసి ఆ సినిమాలను చూడాలా వద్దా అని డిసైడ్ అవుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో హైయెస్ట్ రేటింగ్ పొందిన సినిమాల జాబితా ఇలా ఉంది.

ది షాషాంక్ రిడెంప్షన్ :

ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో హైయెస్ట్ రేటింగ్ పొందిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. జీవితంలో అంతా కోల్పోయాం.. ఏమి చేయలేని స్థితిలో ఉన్నాం అనుకునే వారికి.. ఈ సినిమా ఖచ్చితంగా ఓ హోప్ ను క్రియేట్ చేస్తుంది. కొన్ని సినిమాలు లైఫ్ లో ఓసారైనా చూడాలంటారు కొందరు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాకు ఇంటర్నెట్ మూవ్ డేటా బేస్ లో 9.3 రేటింగ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ , నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

ది గాడ్‌ఫాదర్ :

ఈ సినిమా అంతా కూడా ఓ మాఫియా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాగా ఈ సినిమా ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 9.2 రేటింగ్ దక్కించుకుంది. ది గాడ్ ఫాదర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ , నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి.

ది డార్క్ నైట్:

యాక్షన్ , ఎడ్వెంచర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ఏకంగా మూడు ఓటీటీ లలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ , నెట్ ఫ్లిక్స్ , జియో సినిమా ప్లాట్ ఫార్మ్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఈ సినిమా ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 9 రేటింగ్ దక్కించుకుంది.

ది గాడ్‌ఫాదర్ 2:

ది గాడ్ ఫాదర్ మొదటి పార్ట్ కు ఊహించని రెస్పాన్స్ రావడంతో.. గాడ్ ఫాదర్ 2 ను కూడా రూపొందించారు మేకర్స్. కాగా ఈ సినిమాకు ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 9 రేటింగ్ దక్కించుకుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు పార్ట్స్ ను మిస్ చేస్తే మాత్రం.. వెంటనే చూసేయండి.

12 యాంగ్రీ మెన్:

ఇదే పేరుతో అమెజాన్ ప్రైమ్ లో రెండు సినిమాలు ఉంటాయి. 12 యాంగ్రీ మెన్ 1957 , 12 యాంగ్రీ మెన్ 1997. ఈ రెండు సినిమాలు కూడా అప్పట్లో ప్రేక్షకులను బాగానే మెప్పించాయి. వీటిలో 12 యాంగ్రీ మెన్ 1997 సినిమా ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 9 రేటింగ్ ను దక్కించుకుంది. ఒకవేళ ఈ రెండు సినిమాలను మిస్ చేసి ఉంటే కనుక వెంటనే చూసేయండి.

షిండ్లర్స్ లిస్ట్:

ఈ సినిమా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు మేకర్స్. ఇలాంటి సినిమాలలో ఎదో తెలియని రియాలిటీ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూడండి. ఈ సినిమా ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 9 రేటింగ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ , నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరి వీటిలో మీరెన్ని సినిమాలను చూశారు. ఒకవేళ చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments