Gam Gam Ganesha OTT: అనుకున్న దానికంటే ముందే OTT లోకి.. గం గం గణేశా మూవీ

థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల లోపే దాదాపు సినిమాలన్నీ కూడా ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మే 31 న రిలీజ్ అయినా సినిమాలలో ఒకటి ఆల్రెడీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఇప్పుడు మరో సినిమా.

థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల లోపే దాదాపు సినిమాలన్నీ కూడా ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మే 31 న రిలీజ్ అయినా సినిమాలలో ఒకటి ఆల్రెడీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఇప్పుడు మరో సినిమా.

ఆనంద్ దేవర కొండ నటించిన “గం గం గణేశా” సినిమా.. మే 31 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. మొదటి షో నుంచే బ్లాక్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఇక ఇప్పుడు తెలియనిది ఏముంది. ముందు థియేటర్ లో ఆ సినిమా టాక్ ఎలా ఉందో తెలుసుకుంటున్న ప్రేక్షకులు .. వెంటనే అదే రోజు ఆ సినిమా ఏ ఓటీటీ లోకి వస్తుందా అని కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఇక ఈ సినిమా విడుదలైన రోజునే.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే అప్పుడు.. ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది.

గం గం గణేశా సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన రోజే.. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఊహాగానాలు మొదలైపోయాయి. సాధారణంగా ఓటీటీ రూల్స్ ప్రకారం.. ఏదైనా ఓ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి రూల్స్ ఏమి లేవు. థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. ఆయా సినిమాలు నెలలోపే ఓటీటీ లో ప్రత్యేక్షం అవుతున్నాయి. ఇక ఇప్పుడు గం గం గణేశా మూవీ కూడా అంతే.. ఈ సినిమాను జూన్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్ .కానీ ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా జూన్ 20 అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూ అందరిని సర్ప్రైజ్ చేసింది. కాబట్టి ఈ వారం చూడదగిన సినిమాల లిస్ట్ లో.. ఇప్పుడు మరో సినిమా యాడ్ అయిపోయిందన్నమాట. ఈ వీకెండ్ ఎంచక్కా ఈ సినిమాను చూసేయండి.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాకు ఉదయ్ బొమ్మి శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే ఆయన తెలుగులో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. అలాగే వంశీ కారుమంచి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈయన కూడా తొలిసారి టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా అరంగేట్రం చేశారు. ఇక గం గం గణేశా సినిమాలో నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్స్ గా నటించగా.. వారితో పాటు ఇమ్మాన్యూయెల్, బిగ్ బాస్ ప్రిన్స్ యావర్, వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలలో కనిపించారు. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే ఇక ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఈ మూవీ ఓ వస్తువు చుట్టూ కొనసాగుతుంది. ఆ వస్తువు ఏంటి? అందులో ఏముంది ? చివరకు ఆ వస్తువు హీరోకు దొరికిందా లేదా ! అనే ప్లాట్ తో ఈ సినిమా కొనసాగుతుంది. ఎవరి పాత్రలు ఎలాంటివో తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments