Netflix Best Action Movies: Netflix లో అదరగొడుతున్న ఈ యాక్షన్ మూవీస్ లో.. మీరు ఎన్ని చూశారు!

ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ లు ఓటీటీ లో అందుబాటులో ఉన్నాయి . మరి ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ యాక్షన్ ఎంటెర్టైనెర్స్ ను ఇప్పటివరకు మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ లు ఓటీటీ లో అందుబాటులో ఉన్నాయి . మరి ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ యాక్షన్ ఎంటెర్టైనెర్స్ ను ఇప్పటివరకు మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

వారానికి కొన్ని సినిమాలు, సిరీస్ లు ఓటీటీ లో రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక వాటిలో ఏ సినిమాలు చూడాలి ఏ సినిమాలు బెస్ట్ అనే లిస్ట్ కూడా ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది. ఇక అవి మాత్రమే కాకుండా ఓటీటీ లో ఏ సినిమాలు బావున్నాయి.వాటిని ఎందుకు మిస్ చేయకుండా చూడాలి అనే విషయాలు కూడా చూస్తూనే ఉన్నాము. అయితే ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు బెస్ట్ కంటెంట్ ను అందించడంలో నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు ముందుంటుంది. మరి ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ యాక్షన్ ఎంటెర్టైనెర్స్ ను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం .

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్స్ ఇవే.

1. 1917:

2019 లో సామ్ మెండిస్ దర్వకత్వంలో 1917 అనే ఈ సినిమా వచ్చింది. మొదటి ప్రపంచ యుద్దాన్ని బేస్ చేసుకుని.. దానికి సంబందించిన కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఇద్దరు బ్రిటిష్ సైనికులు చేసిన వీరోచిత పోరాటమే ఈ సినిమా.

2. బేబీ డ్రైవర్:

2017 లో ఎడ్గార్ రైట్ దర్శకత్వంలో బేబీ డ్రైవర్ అనే ఈ సినిమాను రిలీజ్ చేశారు. అన్సెల్ ఎల్‌గార్ట్ అనే యువతి తన ఫ్రెండ్ డెబోరాతో కలిసి నేర జీవితాన్ని గడుపుతుంటాడు. దాని నుంచి బయటపడేందుకు డ్రైవర్ గా మారాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతను ఎలా తప్పించుకోగలిగాడు అనేది తెరపైన చూడాల్సి ఉంటుంది.

3. బిగ్ 4:

2022 లో టిమో త్జాజాంటో తెరకెక్కించిన సినిమా బిగ్ 4. ఇది ఒక ఇండోనేషియాకు చెందిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ . దీనిలో ఆర్యసత్య, లుటేషా, ఆరీ క్రిటింగ్, క్రిస్టో ఇమ్మాన్యుయేల్ అనే నలుగురు హంతకులుగా మారుతారు. వారంతా ఎలా హంతకులుగా మారన్నదే ఈ సినిమా కథ.

4. ఈక్వలైజర్-3:

2014 లో ఆంటోయిన్ ఫుక్వా ఈక్వలైజర్-3 సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో డెంజెల్ వాషింగ్టన్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే .. సౌత్ ఇటలీలోని ఒక చిన్న పట్టణంలో తన కొత్త ఫ్రెండ్ కామోరా సభ్యులు బెదిరించినట్లు మెక్‌కాల్ అనే వ్యక్తి తెలుసుకుంటాడు. వారిని ఈ ప్రమాదం నుంచి ఎలా కాపాడాడు? అనేది ఈ సినిమా కథ.

5. గాడ్జిల్లా:

2014లో గారెత్ ఎడ్వర్డ్స్ తెరకెక్కించిన ఈ అమెరికన్ మూవీ ఏ “గాడ్జిల్లా”. ఈ చిత్రంలో ఆరోన్ టేలర్-జాన్సన్, కెన్ వటనాబే, ఎలిజబెత్ ఒల్సేన్, జూలియట్ బినోచే, సాలీ హాకిన్స్, డేవిడ్ స్ట్రాథైర్న్, బ్రయాన్ క్రాన్స్టన్ ముఖ్య పాత్రలలో నటించారు. గాడ్జిల్లా, ముటస్ అని పిలిచే ఇద్దరు రాక్షసుల మధ్య జరిగే పోరాటంలో.. ఓ అమెరికన్ సైనికుడు చిక్కుకుంటాడు. వారి నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు అనేది ఈ సినిమా కథ.

6. గాడ్జిల్లా మైనస్ వన్:

2023లో జపాన్ లో విడుదలైన సూపర్ హిట్ మూవీ ‘గాడ్జిల్లా మైనస్ వన్’. ఆ తర్వాత జూన్ 1 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా రూ.120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా, ఏకంగా రూ. 660 కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. పైగా ఈ ఏడాది బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు కూడా దక్కించుకుంది.

7. హార్డ్‌ కోర్ హెన్రీ:

2016 లో ఇలియా నైషుల్లర్ తెరకెక్కించిన సినిమా హార్డ్ కొర్ హెన్రీ. ఈ సినిమాలో షార్ల్టో కోప్లీ, డానిలా కోజ్లోవ్‌స్కీ, హేలీ బెన్నెట్, టిమ్ రోత్ నటించారు. అమెరికాలో యావరేజ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా .. రష్యాలో మాత్రం సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది.

8. ది హార్డర్ దే ఫాల్:

2021 లో జేమ్స్ శామ్యూల్ తెరకెక్కించిన సినిమా ది హార్డర్ దే ఫాల్ . ఈ మూవీ లో జోనాథన్ మేజర్స్ , ఇద్రిస్ ఎల్బా , జాజీ బీట్జ్ , రెజీనా కింగ్ , డెల్రాయ్ లిండో, లకీత్ స్టాన్‌ఫీల్డ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా కథఅంతా కూడా 19 వ శతాబ్దంలోని అమెరికన్ వెస్ట్‌ లో కౌబాయ్‌స్ , న్యాయవాదులు, చట్టవిరుద్ధమైన వ్యక్తుల చుట్టూ కొనసాగుతుంది.

9. ది కిల్లర్:

2023 లో డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ది కిల్లర్. ఈ సినిమాను ఓ ఫ్రెంచ్ నవల ఆధారంగా తెరకెక్కించారు. అనుకోకుండా హంతకుడిగా మారిన ఓ హంతకుడు తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడు. అనేది ఈ సినిమా కథ.

10. లూపర్:

2012 లో రియాన్ జాన్సన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లూపర్. బెస్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీస్ లో ఒకటిగా లూపర్ సినిమా నిలిచింది. ఈ మూవీలో బ్రూస్ విల్లీస్, జోసెఫ్ గోర్డాన్-లెవిట్, ఎమిలీ బ్లంట్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ అంతా కూడా కాంట్రాక్ట్ కిల్లర్ల చుట్టూ తిరుగుతుంది.

ఈ సినిమాలన్నీ కూడా నెట్ ఫ్లిక్స్ లో ఎప్పటినుంచో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ.. మూవీ లవర్స్ వీటిని మిస్ చేసే అవకాశం లేకపోలేదు. అటువంటి వారి కోసమే ఈ నెట్ ఫ్లిక్స్ యాక్షన్ ఎంటర్టైనర్స్ లిస్ట్. మరి ఈ సినిమాలలో ఏ సినిమానైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments