OTT Movie Suggestion: అందమైన హీరోయిన్.. ముట్టుకుంటే చస్తారు! OTTలో ఈ మూవీ చూస్తే ఫ్యూజులు అవుట్!

సినిమాలంటే స్టార్ క్యాస్టింగ్ ఉంటేనే చూడాలి అనే స్థాయి నుంచి.. కథలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే రోజులు వచ్చేశాయి. అయినా కూడా కొన్ని కొన్ని సినిమాలను మిస్ చేసేస్తూ ఉంటారు ప్రేక్షకులు. మరి మీరు మిస్ చేసిన సినిమాలలో ఈ సినిమా కూడా ఉందేమో చూసేయండి.

సినిమాలంటే స్టార్ క్యాస్టింగ్ ఉంటేనే చూడాలి అనే స్థాయి నుంచి.. కథలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే రోజులు వచ్చేశాయి. అయినా కూడా కొన్ని కొన్ని సినిమాలను మిస్ చేసేస్తూ ఉంటారు ప్రేక్షకులు. మరి మీరు మిస్ చేసిన సినిమాలలో ఈ సినిమా కూడా ఉందేమో చూసేయండి.

కొన్ని సినిమాలను జస్ట్ ట్రైలర్ చూసి, లేదా అక్కడ ఇక్కడ టాక్ విని లైట్ తీసుకుంటూ ఉంటారు మూవీ లవర్స్. మళ్ళీ ఆ సినిమాలోని సీన్స్ సోషల్ మీడియాలో కనిపించినప్పుడు ఆ సినిమాల కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా గురించి కూడా అలానే సెర్చ్ చేసి ఉంటారు. ఇప్పటివరకు ఇలాంటి సినిమాలు ఎన్నో మిస్ చేసిన ప్రేక్షకులకు.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అందులో ఒకటి. ఒకవేళ ఈ సినిమాను కనుక మిస్ చేసి ఉంటె ఓ వర్త్ వాచింగ్ సినిమాను మిస్ చేసినట్లే. పైగా ఈ సినిమాను చూసిన తర్వాత ఈ సినిమాని ఎలా మిస్ చేశాం అనే ఫీలింగ్ రావడం ఖాయం. పైగా ఇదొక తెలుగు సినిమా. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు నటి పూర్ణ నటించిన సువర్ణ సుందరి. ఈ సినిమాలో పూర్ణతో పాటు జయప్రద, సాక్షి , ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. సురేంద్ర మాదారపు ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండడంతో.. ఈ సినిమాపై అందరికి అంచనాలు పెరిగిపోయాయి. కానీ, థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. థియేటర్ లో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న సరే .. ఓటీటీ లో మాత్రం బాగానే మెప్పించింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమా ఎందుకు చూడాలి అనే విషయానికొస్తే..

ఈ సినిమా కథంతా.. సువర్ణ సుందరి అనే ఓ విగ్రహం చుట్టూ తిరుగుతుంది. కర్ణాటకలోని కాలక్కల్ సంస్థానంలో త్రినేత్రి అమ్మవారి విగ్రహాలను తయారు చేసే ఓ వ్యక్తి.. 300 ఏళ్ళ క్రితం ఆ విగ్రహంలో కొన్ని దుష్ట శక్తులను నింపుతాడు. దానితో ఆ రాజ్యం మొత్తం నాశనం అవుతుంది. దానికి ఆ విగ్రహమే కారణం అని.. గ్రామస్తులంతా ఆ విగ్రహాన్ని భూస్థాపితం చేస్తారు. అయితే తిరిగి 300 ఏళ్ళ తర్వాత ఓ వ్యక్తి పొరపాటున ఆ విగ్రహాన్ని బయటకు తీస్తాడు. దీనితో అతని కుటుంబం అంత చనిపోతుంది. కొంతకాలం తర్వాత ఆ విగ్రహం ఓ బంగ్లాకు చేరుతుంది. అదే బంగ్లాలో పూర్ణ తన కుటుంబంతో కలిసి దిగుతుంది. ఇక అసలు కథ అప్పుడు స్టార్ట్ అవుతుంది. పూర్ణ ఆ విగ్రహాన్ని టచ్ చేయగానే.. ఆ దుష్ట శక్తీ ఆమెలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది ! పూర్ణ కుటుంబం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది ! చివరికి ఆ విగ్రహం ఏమైంది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments