Best Psycho Thriller Movie In OTT: భర్త బోర్డర్ లో.. కోరికలతో భార్య! ఈ సైకో కిల్లర్ మూవీ OTTలో ఉంది చూశారా!

OTT Movie Suggestion: కొన్ని సినిమాలు చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయా అని ఫీలింగ్ ఈ సినిమాలను చూస్తూనే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమానే.

OTT Movie Suggestion: కొన్ని సినిమాలు చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయా అని ఫీలింగ్ ఈ సినిమాలను చూస్తూనే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమానే.

ఓటీటీ లో అనేక సినిమాలు ఉంటాయి. కాబట్టి వాటిలో కొన్ని సినిమాలను ప్రేక్షకులు మిస్ చేసే అవకాశం ఉంది. ఆ సినిమాలను సంబంధించిన సీన్స్ ఏమైనా సోషల్ మీడియాలో కనిపించినప్పుడు ఆ సినిమాలు ఎక్కడ ఉన్నాయా అని సెర్చ్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్ . ఇలా ఇప్పటివరకు చాలా సినిమాలను మిస్ చేసి ఉంటారు. వారికోసమే ఈ మూవీ సజ్జెషన్. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా మీరు మిస్ చేసిన వాటిలో ఉందేమో ఓ లుక్ వేసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఎందుకు ఈ సినిమాను చూడాలి అనే విషయాలను చూసేద్దాం.

థ్రిల్లర్ సినిమా అంటే ఇప్పటివరకు కేవలం కథలో మాత్రమే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చూసి ఉంటారు. కానీ ఈ సినిమా చూస్తే నటనతో కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలిగించి.. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తిని ప్రేక్షకులలో కలిగించవచ్చని అనిపిస్తూ ఉంటుంది. ఓ మంచి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ను చూసేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఈ సినిమా కథేంటంటే.. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ సినిమా మొదలవుతుంది. ఆ యుద్ధంలో పాల్గొనడం కోసం పర్ల్ అనే మహిళ కుటుంబం నుంచి తన భర్త బోర్డర్ కు వెళ్తాడు. దీనితో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తూ ఉంటుంది. అక్కడ ఆమె ఓ యానిమల్ ఫార్మ్ ను చూసుకుంటూ జీవితం కొనసాగిస్తోంది. పైగా ఆమెకు సినిమాలు, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.. దీనితో తన తల్లిదండ్రులకు తెలియకుండా.. రెగ్యులర్ గా సినిమాలకు వెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ థియేటర్ లో పనిచేసే వ్యక్తికీ దగ్గరవుతుంది పర్ల్.

కట్ చేస్తే అదే సమయంలో పర్ల్ మరదలు తన ఇంటికి వచ్చి దగ్గరలోని ఓ చర్చ్ లో ఆడిషన్స్ జరుగుతున్నాయని.. అందులో సెలెక్ట్ అయితే డ్యాన్సర్ గా అవకాశం వస్తుందని చెప్తుంది. పర్ల్ కు కూడా ఆడిషన్స్ కు వెళ్లాలని ఆశపడుతోంది. కానీ ఇంట్లో తనకు ఉన్న బాధ్యతల కారణంగా వెళ్లలేకపోతున్న అని బాధపడుతూ .. ఆ థియేటర్ లో పని చేసే వ్యక్తికీ చెప్తుంది. అతను ఈమెకు ఎమోషనల్ గా సపోర్ట్ ఇస్తాడు. దీనితో ఓ రోజు పర్ల్ తన ఆశయాలకు అడ్డుగా ఉన్న తన తల్లిదండ్రులను చంపేయాలని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది ! ఆమె తల్లి దండ్రులను చంపేసిందా ! పర్ల్ భర్తకు తన రిలేషన్ గురించి తెలుస్తుందా ! ఇవనీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఒంటరి తనాన్ని భరిస్తున్న ఆ సైకో అమ్మాయి చివరికి ఏం చేసింది అనేది ఈ “పర్ల్” సినిమా. 2022 లో రిలీజ్ అయినా ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటె కనుక వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments