OTT Best Horror Movie: పగపట్టే తల లేని దెయ్యం కథ.. OTTలో ఈ సినిమా చూడాలంటే ధైర్యం ఉండాలి!

OTT Movie Suggestion: హారర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉంటె ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మాత్రం అసలు మిస్ చేయకండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Movie Suggestion: హారర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉంటె ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మాత్రం అసలు మిస్ చేయకండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఓటీటీ లో కొన్ని వేల సినిమాలు ఉన్నాయి. దీనితో ఓటీటీ మూవీ లవర్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యన హారర్ సినిమాలు చూసే ప్రేక్షకులు ఎక్కువయిపోయారు. దీనితో ఇలాంటి కంటెంట్ కోసం ఎక్కువ సెర్చ్ చేసేస్తున్నారు. మేకర్స్ కూడా ఈ మధ్యన ఇలాంటి సినిమాలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే హారర్ సినిమా కూడా ఇలాంటిదే. ఈ క్రమంలో ఇప్పటివరకు ఈ సినిమాను మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కథేంటంటే.. 1943 లో ఇండోనేషియాలోని ఓ గ్రామంలో.. జపాన్ సైన్యం దాడి చేసి ఇండోనేషియన్ ప్రజలను విచక్షణ రహితంగా చంపుతూ ఉంటారు, అదే సమయంలో ఇండోనేషియాలో వచ్చి ఉన్న డచ్ సైన్యాన్ని కూడా జపాన్ సైన్యం చంపేస్తారు. అదె సమయంలో ఇవన్నా అనే ఓ డచ్ మహిళా.. జపాన్ సైన్యం నుంచి ఇండోనేషియా ప్రజలను కాపాడుతూ ఉంటుంది. అది గమనించిన జపాన్ సైన్యం.. ఇవన్నాను వాళ్ళ సైన్యాధికారి దగ్గరకు తీసుకుని వెళ్తారు. దీనితో ఆ సైన్యాధికారి ఇవన్నాను చంపేద్దాం అనుకుంటారు. ఈ క్రమంలో ప్రభు అనే వ్యక్తి ఇవన్నాను కాపాడతాడు. ఈ క్రమంలో అతను చనిపోతాడు. కట్ చేస్తే స్టోరీని 1993 కు వస్తుంది. ఇక్కడ అంబర్ , డిక అనే ఇద్దరు అక్క తమ్ముళ్లు వాళ్ళ పేరెంట్స్ చనిపోడంతో.. ఓ అనాధ ఆశ్రమానికి వెళ్తుంటారు. అయితే అంబర్ కు ఎవరికీ కనిపించని ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే తనకు కళ్ళు కూడా సరిగా కనిపించవు.

ఈ క్రమంలో ఆశ్రమానికి వెళ్లిన అంబర్, డికా అనుకోకుండా ఓ రోజు ఓ పాడుపడిన ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో వారికి వింత వింత అనుభవాలు ఎదురౌతాయి. అంబర్ కు అక్కడ ఓ తల లేని విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం లేచి నడవడం, తన వెనకాలే రావడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే అక్కడ 1943 లోని ఇవన్నా డైరీ కనిపిస్తుంది. వారు తిరిగి వారి ఆశ్రమానికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే అప్పుడు జరిగిన సంఘటలన్నీ అంబర్ కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. అలాగే ఆ తల లేని విగ్రహం కూడా అంబర్ రూమ్ లో ప్రత్యేక్షమవుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది ? ఇవన్నీ ఇవన్నా కే ఎందుకు కనిపిస్తున్నాయి ? 1943 లో జరిగిన సంఘటనలు 1993 లో ఎందుకు మెదిలాయి ?అసలు ఆ తల లేని విగ్రహం ఎవరిదీ ? ఆ విగ్రహంలో ఏదైనా ఆత్మ ఉందా ? 1943 లో ఇవాన్నకు ఏమైంది ? అసలు కథ చివరికి ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే “ఇవన్నా” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments