Swetha
OTT Movie Suggestion: కొన్ని సినిమాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చుపెడతాయి. క్షణ క్షణ ఉత్కంఠ భరింతంగా సాగే సన్నివేశాలు పేక్షకులను మరింత ఇంట్రెస్టింగ్ గా ఆ సినిమాను చూసేలా చేస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.
OTT Movie Suggestion: కొన్ని సినిమాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చుపెడతాయి. క్షణ క్షణ ఉత్కంఠ భరింతంగా సాగే సన్నివేశాలు పేక్షకులను మరింత ఇంట్రెస్టింగ్ గా ఆ సినిమాను చూసేలా చేస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.
Swetha
క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మిస్ చేసి ఉంటే మాత్రం.. ఓ మంచి ఇంట్రెస్టింగ్ సినిమాను మిస్ అయినట్లే. ఇప్పుడంటే ఓటీటీ లో కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు ఓటీటీ లోకి వస్తున్నాయి. కానీ వీటికంటే ముందే ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ లో ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలను చూస్తున్న ప్రేక్షకులు కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలను మిస్ చేస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూసే వారు ఈ సినిమాను అసలు మిస్ కాకుండా చూడాల్సిందే. కొన్ని సినిమాలు కొన్ని సినిమాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చుపెడతాయి. క్షణ క్షణ ఉత్కంఠ భరింతంగా సాగే సన్నివేశాలు పేక్షకులను మరింత ఇంట్రెస్టింగ్ గా ఆ సినిమాను చూసేలా చేస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు చూసేద్దాం.
ముందు అసలు ఈ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికొస్తే.. 2021 లో విడుదలైన ఓ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ ఈ సినిమా.. పోలీస్ ఆఫీసర్ జో బేలర్ అనే వ్యకి 911 కాల్ సెంటర్ లో పని చేస్తూ ఉంటాడు. ఓ రోజు ఓ మహిళా నుంచి ఎమెర్జెన్సీ కాల్ వస్తుంది. తాను కిడ్నాప్ కు గురి అయినట్లు.. ఆమెను ఓ వైట్ వ్యాన్ లో తీసుకు వెళ్తున్నట్లు చెప్తుంది. పూర్తి వివరాలు చెప్పే లోపే ఫోన్ కట్ అవుతుంది. దీనితో జో పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేస్తాడు. కానీ పోలీసులు ఆ వ్యాన్ ను పట్టుకోలేకపోతారు. దీనితో ఆ మహిళా ఇంటికి కాల్ చేయగా… ఆమె కూతురు ఆ కాల్ ను ఆన్సర్ చేసి.. తన అమ్మా నాన్న గొడవ పడ్డారని.. దీనితో ఆమెను వాళ్ళ నాన్న ఎక్కడికో తీసుకుని వెళ్లారని చెప్తుంది. ఈ క్రమంలో ఆ మహిళ భర్తపైన ఇది వరకే కొన్ని కేసులు ఉన్నట్లు గుర్తిస్తారు.అయితే ఆ ఇంట్లో ఆ మహిళా కూతురు, కొడుకు మాత్రమే ఉండడంతో ఇద్దరు పోలీసులను వారికి రక్షణగా పంపిస్తాడు.
కట్ చేస్తే ఆ ఇంట్లో ఉన్న ఇద్దరిలో ఆ మహిళ కొడుకు రక్తపు మడుగులో కనిపిస్తాడు. ఇక్కడి నుంచి కథ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఆ మహిళ ఇంటికి వెళ్లిన పోలీసులకు అక్కడ కొన్ని మెడికల్ రిపోర్ట్స్ కనిపిస్తాయి. ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఆమె ఒక మానసిక రోగి అని గుర్తిస్తారు. దీనితో జో ఆమెను తన కుమారుడి హత్య గురించి ప్రశ్నిస్తాడు. దానికి ఆమె తన కొడుకు కడుపులో పాములు ఉన్నాయని.. కోసి తీసేసానని అమాయకంగా చెప్తుంది. ఇక అప్పుడు ఆమె మెంటల్ పేషంట్ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు జో. కట్ చేస్తే వ్యాన్ లో ఉన్న ఆ మహిళ తన భర్త తలపై కొట్టి పారిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది ? ఇంతకీ ఆ పిల్లాడిని చంపింది ఎవరు ? జో ఆమెను రక్షించడం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? దాని వలన జో కు కలిగిన నష్టం ఏంటి ? చివరికి ఈ కథ ఎలా ముగిసింది? ఇవన్నీ తెలియాలంటే “ది గిల్టీ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.