డిలీటెడ్ సీన్స్ తో OTTలోకి ఆయ్ మూవీ? డైరెక్టర్ క్లారిటీ..

Aay Movie OTT Release With Deleted Scenes: గత వారం రిలీజ్ అయినా సినిమాలలో రెండు పెద్ద సినిమాలకు పోటీగా వచ్చిన సినిమా.. ఆయ్. చిన్న సినిమాగా ఎంట్రీ ఇచ్చినా కానీ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ఓటీటీ రన్ టైమ్ పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Aay Movie OTT Release With Deleted Scenes: గత వారం రిలీజ్ అయినా సినిమాలలో రెండు పెద్ద సినిమాలకు పోటీగా వచ్చిన సినిమా.. ఆయ్. చిన్న సినిమాగా ఎంట్రీ ఇచ్చినా కానీ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ఓటీటీ రన్ టైమ్ పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కథలో కంటెంట్ ఉంటే చాలానే ప్రూవ్ చేసిన సినిమాల లిస్ట్ లో ఆయ్ కూడా యాడ్ అయింది. తారక్ బావమరిది నితిన్ నార్నె రెండవ సినిమా అయినా కూడా.. ఊహించని రేంజ్ లో ప్రేక్షకుల నుంచి.. ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఆగస్ట్ 15న రెండు పెద్ద సినిమాల మధ్యన ఈ సినిమాను రిలీజ్ చేస్తూ నితిన్ నార్నె సాహసం చేస్తున్నాడని అనుకున్నారంతా.. కానీ ఇప్పుడు ఆ సాహసమే నితిన్ కు మంచి సక్సెస్ ను తెచ్చిపెట్టింది. ఇక థియేట్రికల్ రన్ తో పాటు.. ఆయ్ మూవీ ఓటీటీ డీల్ ను కూడా క్లోజ్ చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ఓటీటీ రన్ టైమ్ పై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించిన పూర్తి విషయాలు ఇలా ఉన్నాయి.

తాజాగా థియేటర్ లో బ్లాక్ బస్టర్ మూవీ కల్కి.. ఓటీటీ లోకి వచ్చింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సినిమా అయినా కానీ ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మాత్రం ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఎందుకంటే ఓటీటీ లో ఈ మూవీ రన్ టైమ్ లో 6 నిముషాలు ట్రిమ్ చేశారు. ఈ మధ్య ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ఎదో కొత్త రూల్ వచ్చిందట. థియేటర్ లో ఎంత రన్ టైమ్ ఉంటుందో ఓటీటీలో కూడా అంతే ఉండాలని. దీనితో రాబోయే సినిమాలు కూడా ఇలానే ఉంటాయా అని ప్రేక్షకులలో అనుమానం మొదలైంది. కానీ ఆయ్ మూవీ విషయంలో మాత్రం ఇలా జరగదు. ఎందుకంటే ఈ మూవీ ఓటీటీ రన్ టైం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశారు. డిలీట్ అయిన సీన్స్ తో పాటు.. ఈ మూవీ ఓటీటీ లోకి రానుందనే అనౌన్స్ చేశారు.

ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ మూవీ థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది కాబట్టి… కాస్త ఆలస్యంగానే ఓటీటీ లోకి వస్తుందనే టాక్ వినిపిస్తుంది. కాగా ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. ఇదే జోరు కనుక కొనసాగితే లాంగ్ రన్ కాసుల వర్షం కురిపించడం ఖాయం. పల్లెటూరి బ్యాక్డ్రాప్ తో మనసుని హత్తుకునే కథగా ప్రతి ఒక్కరిని మెప్పించింది ఈ మూవీ. మరి ఈ మూవీ ఓటీటీ రన్ టైమ్ విషయంలో.. డైరెక్టర్ చెప్పిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments