Dear Nanna OTT: OTT లోకి మరో ఫ్యామిలీ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి కొత్త సినిమాలు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఓ వారం ముందుగానే ఓటీటీ లో ఏ ఏ సినిమాలు వస్తాయి అనే లిస్ట్ వచ్చేస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఈ లిస్ట్ లో కనిపించవు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఈ కోవకు చెందిందే.

ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి కొత్త సినిమాలు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఓ వారం ముందుగానే ఓటీటీ లో ఏ ఏ సినిమాలు వస్తాయి అనే లిస్ట్ వచ్చేస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఈ లిస్ట్ లో కనిపించవు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఈ కోవకు చెందిందే.

ఓటీటీ లో అనేక సినిమాలు, సిరీస్ లు నిత్యం వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులకు చూసే ఓపిక తీరిక ఉండాలే కానీ, చూస్తున్న కొద్దీ తరిగిపోని ఇంకా ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఉన్నాయి. ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నవి అన్ని కేవలం అఫీషియల్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోవే. కానీ, అవి మాత్రమే కాకుండా ఇంకా చాలానే సైట్స్ లో అనేక సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఓటీటీ లోకి వచ్చే ముందు విపరీతమైన బజ్ తో వస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎటువంటి బజ్ లేకుండా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఓటీటీలకి ఇపుడు కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ లో నటించి అందరిని మెప్పించిన వారే ఇప్పుడు ఓటీటీ లోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో యూట్యూబ్ లో 30 వెడ్స్ 21 సిరీస్ తో అందరిని మెప్పించిన నటుడు చైతన్య రావు. ఇప్పుడు ఈ నటుడు మెయిన్ లీడ్ లో నటించిన మూవీఏ “డియర్ నాన్న”. రెగ్యులర్ హర్రర్, యాక్షన్ , సస్పెన్స్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వారికి ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ డ్రామా.. ఈ సినిమా నేరుగా జూన్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఎంచక్కా చూసి ఎంజాయ్ చేసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రవి అనే ఓ పెద్దాయన ఓ ఫార్మసిస్ట్.. అతను తన పని విషయంలో మాత్రం చాల ఖచ్చితంగా ఉంటాడు. తన భార్య, కొడుకు సూర్య కోసం సరిపడా డబ్బు సంపాదిస్తూ.. ఉన్నంతలో వాళ్ళను సంతోషంగా చూసుకుంటాడు. తనలానే అతని కొడుకు కూడా ఆ పార్మాసిస్ట్ వృత్తిలో కొనసాగాలని అనుకుంటాడు. కానీ సూర్య మాత్రం మంచి చెఫ్ అవ్వాలని అనుకుంటాడు. ఈ క్రమంలో వారి కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలేంటి. ఎవరు ఎవరిని అర్థంచేసుకుంటారు. అనేదే ఈ సినిమా కథ. కుటుంబం అంతా చక్కగా కలిసి చూసే మూవీ ఇది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments