Swetha
OTT Best Horror Mystery Thriller- The Rental: కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా నెల లోపే ఓటీటీ లోకి వస్తుంటే.. కొన్ని మాత్రం నెలలు , సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఓటీటీ లోకి రావు. ఈ క్రమంలో ఏకంగా నాలుగేళ్ల తర్వాత ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.
OTT Best Horror Mystery Thriller- The Rental: కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా నెల లోపే ఓటీటీ లోకి వస్తుంటే.. కొన్ని మాత్రం నెలలు , సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఓటీటీ లోకి రావు. ఈ క్రమంలో ఏకంగా నాలుగేళ్ల తర్వాత ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.
Swetha
ఓటీటీ లో సినిమాలు చూసే కొద్దీ వస్తూనే ఉంటున్నాయి. ఇక వీటిలో హర్రర్ సినిమాల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఉన్న అన్ని హర్రర్ సినిమాలను చూసేసాం అనుకున్నా కూడా.. చూసేందుకు ఇంకా చాలానే మిగిలి ఉంటాయి. అటు థియేటర్స్ లో కూడా ప్రస్తుతం హర్రర్ సినిమాలు ఎలాంటి క్రేజ్ ను క్రియేట్ చేస్తున్నాయో చూస్తూనే ఉంటున్నాము. అయితే ఇప్పుడు దాదాపు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా నెలలోపే ఓటీటీ లోకి వస్తుంటే.. కొన్ని సినిమాలు మాత్రం నెలలు, సంవత్సరాలు గడిచినా కూడా ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వవు. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా నాలుగేళ్ల తర్వాత ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ రాబోతుంది. మరి ఆ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా పేరు ది రెంటల్.. 2020 లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. ఆ సమయంలో ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఇన్ని సంవత్సరాలు ఈ మూవీ ఓటీటీ లోకి రాకపోవడానికి కారణం తెలియదు. కానీ , ఇప్పుడు ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణ , అందులోను హర్రర్ సినిమాలకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని.. నాలుగేళ్ల తర్వాత ఈ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురావడం విశేషం. అయితే ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ ఓటీటీ లలో కాకుండా స్పెషల్ ఓటీటీ లయన్స్ గెట్ ప్లే లోకి తీసుకుని వస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి తెలుగులో ఉంటుందా లేదా అనే దానిపై అయితే ఇంకా క్లారిటీ లేదు కానీ.. సినిమా మాత్రం ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుందని చెప్పి తీరాలి.
ఇక ది రెంటల్ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా కథ అంతా కూడా రెండు జంటల మధ్య తిరుగుతూ ఉంటుంది. బిజీ బిజీ గా సాగిపోతున్న వారి జీవితాల నుంచి.. కాస్త రిలాక్స్ అవ్వడానికి ఈ రెండు జంటలు.. అందరికి దూరంగా ఓ కొండపై ఇంటిని అద్దెకు తీసుకుంటారు. అక్కడైనా ప్రశాంతత లభిస్తుంది అనుకుంటే.. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లకు కొన్ని ఊహించని ఘటనలు ఎదురౌతాయి. సరదాగా వెకేషన్ కు వెళ్లిన వాళ్లకు… అది కాస్త ఓ పీడకలలా మారిపోతుంది. దాని నుంచి వాళ్ళు బయట పడ్డారా లేదా ? అసలు అక్కడ వాళ్లకు ఎదురైనా పరిస్థితులు ఏంటి ? చివరికి అక్కడ ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.