Back OTT: తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ తో రెచ్చిపోయిన బాక్ మూవీ OTTలోకి!

ప్రస్తుతం థియేటర్ లో సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంటున్న సినిమాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఓటీటీ బాట పడతాయా అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరొక సూపర్ హిట్ సినిమా.. బాక్ ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ గురించి.. బజ్ నడుస్తుంది.

ప్రస్తుతం థియేటర్ లో సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంటున్న సినిమాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఓటీటీ బాట పడతాయా అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరొక సూపర్ హిట్ సినిమా.. బాక్ ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ గురించి.. బజ్ నడుస్తుంది.

ఓటీటీ లోకి కొత్త సినిమాలు వచ్చే సమయం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఓటీటీ లో సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంటున్న సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయా అని ప్రేక్షకులు అంతా ఎదురుచూస్తున్నారు. ఎంత ఆయా సినిమాలను థియేటర్ లో చూసినా కానీ.. మళ్ళీ ఆయా సినిమాలను ఓటీటీ లోను చూడాల్సిందే. ఈ క్రమంలోనే తమన్నా, రాశీ ఖన్నా కలిసి నటించిన తమిళ హర్రర్ కామెడీ మూవీ అరణ్మణై 4 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ , స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ కోలీవుడ్ లో టాక్ నడుస్తుంది. కోలీవుడ్ సంగతి ఎలా ఉన్నా కానీ.. తెలుగులో ఈ సినిమాను బాక్ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా కంఫర్మ్ అయినట్లు టాక్ నడుస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళంలో సూపర్ సక్సెస్ సాధించిన అరణ్మణై ఫ్రాంచైజీ నుంచి నాలుగవ సినిమాగా వచ్చిందే.. ఈ అరణ్మణై 4 . తెలుగులో బాక్ అనే పేరుతో రిలీజ్ అయిన సినిమా. ఈ సినిమాకు డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహించారు. కేవళంలో తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సిరీస్ బాగా హిట్ అయింది. దీనితో ఈ సినిమాలను బ్రేక్ లేకుండా తీస్తున్నారు. నిజానికి అస్సాంలో బాక్ అనే దెయ్యం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు అలాంటి కథలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను తీశారు. అంటే అస్సాంకు చెందిన బాక్ అనే దెయ్యం, సౌత్ కు వస్తే ఎలా ఉంటుందనే కథనాన్ని ఈ సినిమాలలో చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాను మే 3 న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు థియేటర్ లో టాక్ కూడా బాగానే నడిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు కూడా బజ్ నడుస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మే 31 లేదా జూన్ 10 లోపు జీ 5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ నడుస్తుంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

సాధారణంగా ఏ సినిమాలైనా కూడా థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. వాటి వాటి ఓటీటీ స్ట్రీమింగ్ డిటైల్స్ అనేవి మారుతూ ఉంటాయి. మరి ఈ సినిమాకు కూడా మారే అవకాశాలు లేకపోలేదు. లేదంటే ఇప్పుడు వినిపిస్తున్న డేట్స్ ప్రకారమే ఓటీటీ లో విడుదల అయితే కనుక.. నెల లోపు ఓటీటీ లో విడుదలైన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరి పోతుంది. మరి ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ అఫీషియల్ డేట్ గురించి వెయిట్ చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోనుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments