OTT Action Thriller Series: OTT లోకి ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'ముర్షిద్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

OTT లోకి ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘ముర్షిద్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

OTT Action Thriller Series: ఓటీటీ లో ఎన్ని సినిమాలు ఉన్నా కానీ.. ఇంకా ఏదైనా కొత్త సినిమాలు వస్తాయేమో అని.. ఎదురుచూస్తుంటారు మూవీ లవర్స్. ఈ క్రమంలో ఓటీటీ లో మరో ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రిలీజ్ కు రెడీ అయిపోతుంది. మరి ఈ సిరీస్ ఏంటో చూసేద్దాం.

OTT Action Thriller Series: ఓటీటీ లో ఎన్ని సినిమాలు ఉన్నా కానీ.. ఇంకా ఏదైనా కొత్త సినిమాలు వస్తాయేమో అని.. ఎదురుచూస్తుంటారు మూవీ లవర్స్. ఈ క్రమంలో ఓటీటీ లో మరో ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రిలీజ్ కు రెడీ అయిపోతుంది. మరి ఈ సిరీస్ ఏంటో చూసేద్దాం.

ఓటీటీ లలో ప్రతి వారం చాలా సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ప్రతి వారం ప్రేక్షకులు సినిమాలపై చూపిస్తున్న ఇంట్రెస్ట్ ను దృష్టిలో ఉంచుకుని.. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ.. కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకోవచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్య కాలంలో అయితే కొత్త వెబ్ సిరీస్ లు , సినిమాలు చాలానే రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇక వెబ్ సిరీస్ ల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కంటెంట్ తో.. కొత్త వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ లో మరో ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సిరీస్ ఏంటో చూసేద్దాం.

ఈ వెబ్ సిరీస్ పేరు ముర్షిద్ .. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో కేకే మీనన్ , తనూజ్ విర్వారీ కనిపించారు. క్రైమ్ , యాక్షన్ డ్రామాస్ అంటే ఈ మధ్య ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఈ సిరీస్ కూడా అచ్చం అలాంటిదే. ముంబై నగరాన్ని తమ ఆదీనంలో తెచ్చుకోవడం కోసం.. కొంతమంది గ్యాంగ్ స్టార్స్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనే గ్యాంగ్ స్టార్ డ్రామాగా ఈ సిరీస్ కొనసాగనుంది. కాగా ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో .. ఆగస్ట్ 30 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా ఈ విషయాన్నీ జీ5 అధికారికంగా ప్రకటించింది.

త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సిరీస్ ఎన్ని లాంగ్వేజ్స్ లో విడుదల కానుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ సిరీస్ లో కేకే మీనన్, తనూజ్‍తో పాటు అనంగ్ దేశాయ్, జాకీర్ హుసేన్, జమీల్ చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మధ్య కాలంలో జీ5 ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లను రిలీజ్ చేస్తూనే ఉంది. ఇప్పటికే జీ 5 లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ లో స్ట్రీమింగ్ అయినా.. కొన్ని నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి. ఇక ఈ సిరీస్ ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments