Swetha
కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన వెంటనే ఆ సినిమాలకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ మాత్రం కాస్త ఆలస్యంగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాను సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ వచ్చేశాయి.
కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన వెంటనే ఆ సినిమాలకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ మాత్రం కాస్త ఆలస్యంగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాను సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ వచ్చేశాయి.
Swetha
థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా వారం నెలరోజులు తిరగకుండానే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. సాధారణంగా ఓటీటీ రూల్స్ ప్రకారం థియేటర్ లో సినిమా రిలీజ్ అయినా నెల రోజుల తర్వాత.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ గత కొద్దీ రోజులుగా మాత్రం ఈ పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదు. ఇలా సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయో లేదో వెంటనే ఆ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవుతుంది. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది అనే డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అల్లరి నరేష్ తాజాగా నటించిన ” ఆ ఒక్కటి అడక్కు” మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తాజాగా అల్లరినరేష్ నటించిన సినిమా “ఆ ఒక్కటి అడక్కు”. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుంచి.. అందరికి ఈ మూవీ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అల్లరి నరేష్ కామెడీ కి ఇది మంచి కమ్ బ్యాక్ అని అనుకున్నారు. కానీ థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఈ సినిమా ఊహించినంత రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా మే 3 న థియేటర్ లో రిలీజ్ అయింది. అనుకున్నంత రేంజ్ లో కాకపోయినా డీసెంట్ టాక్, కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఏకంగా రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ సొంతం చేసుకున్నాయి. ఈ సినిమా ఆహ, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దాదాపు వచ్చే రెండు వారాలు లోపే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఆ ఒక్కటి అడక్కు సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, ‘వెన్నెల’ కిశోర్, మురళీ శర్మ, గౌతమి, హర్ష చెముడు ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా టైటిల్ తోనే అందరికి ఇదొక కామెడీ ఎంటర్టైనర్ అని అంచనాలు పెంచేశారు. కానీ సినిమా మాత్రం కాస్త కామెడీ టచ్ ఇస్తూ… ఓ సీరీయస్ మేటర్ తో కథను కొనసాగించారు. ప్రస్తుతం సమాజంలో పెళ్లి కానీ యువత పేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే.. మ్యాట్రిమోనీ సైట్స్ ద్వారా పెళ్లైన అమ్మాయిల నెంబర్స్ ను అబ్బాయిలకు ఇవ్వడం. ఈ సైట్స్ ద్వారా వారికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనేదే ఈ సినిమాలో చూపించారు. దీనితో ఓ రకంగా ఈ సినిమాలో కాస్త కామెడీ తగ్గింది. మరి ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఎంత మందిని మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.