Swetha
డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోనే త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ సినిమా విడుదుల కానుంది. భారతీయ సంగీత చరిత్రలో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన స్టార్ సింగర్ “చమ్కీల”. ఇప్పుడు చమ్కీల పేరుతో ఆయన జీవిత చరిత్ర మీద ఓ సినిమా తెరకెక్కింది. దీనికి సంబంధించిన ట్రైలర్ మార్చి 28న విడుదల చేశారు.
డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోనే త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ సినిమా విడుదుల కానుంది. భారతీయ సంగీత చరిత్రలో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన స్టార్ సింగర్ “చమ్కీల”. ఇప్పుడు చమ్కీల పేరుతో ఆయన జీవిత చరిత్ర మీద ఓ సినిమా తెరకెక్కింది. దీనికి సంబంధించిన ట్రైలర్ మార్చి 28న విడుదల చేశారు.
Swetha
నేరుగా ఓటీటీలో విడుదల అయ్యే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ క్రమంలోనే త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో రియల్ ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టోరీ కి సంబంధించిన ఓ సినిమా విడుదల కానుంది. భారతీయ సంగీత చరిత్రలో .. అప్పట్లో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన స్టార్ సింగర్ చమ్కీల. ఇప్పుడు “చమ్కీల” పేరుతో ఆయన జీవిత చరిత్ర మీద ఓ సినిమా తెరకెక్కింది. 1980’స్ లో పంజాబ్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన సింగర్ .. చివరకు వివాదాల కారణంగా హత్యకు గురయ్యాడు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమానే “చమ్కీల”. దీనిని ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించాడు. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అమర్ సింగ్ చమ్‌కీలా సినిమాను నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మార్చి 28న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. విడుదల చేసిన ట్రైలర్ ను చూస్తే.. ఇందులో చమ్కీల సింగర్ పాత్రను దిల్జిత్ దొసాంజ్ పోషిస్తున్నాడు. కఠిక పేదరికంలో ఉన్న ఆయన తన స్నేహితుడి సహాయంతో .. రాక్ స్టార్ గా పేరుతెచ్చుకుని.. తన పేదరికాన్ని తన పాటతోనే జయించాడు. ఆయన ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇచ్చేవారు. ఈ క్రమంలో 1988 మార్చి 8న మధ్యాహ్నం 2గంటలకు .. మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తున్న క్రమంలో.. కొందరు గుర్తు తెలియని దుండగులు .. చమ్కీల కారుకు అడ్డుపడి.. వెంటనే ఆయన గొంతులోకి తుపాకులతో వరుస కాల్పులు జరిపినపుడు.. ఆయన అక్కడిక్కడే మరణిస్తాడు. ఈ క్రమంలో ఆయనపై ఎందుకు కాల్పులు జరిపారు. దానికి వెనుక ఉన్నది ఎవరు అనేది.. ఈ సినిమా ద్వారా అందరికి తెలియజెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ తో పాటు, మూడు పాటలు విడుదలయ్యాయి. దీనితో ప్రేక్షకులకు ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ మూవీని ఏప్రిల్ 12నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే, ఈ సినిమాను తీయడానికి కారణం ఏంటి అనేది కూడా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో ప్రసంగిస్తూ .. “సమాజంలో తప్పుడు పోకడలను ప్రశ్నించి ఓ స్థాయికి ఎదిగే యువ సంగీతకారులు దురదృష్టవశాత్తూ హింసాత్మక ఘటనల్లో మృత్యువాత పడటం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదే. చమ్‌కీలా జీవితం కూడా సమాజంలో ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తాయి. ఇది ఓ ఆర్టిస్ట్ కు ఇస్తున్న నివాళి. ఏం జరిగినా తన జీవితంలో తన తొలి ప్రేమ అయిన మ్యూజిక్ ను మాత్రం అతడు ఎన్నడూ వీడలేదు” అంటూ ఇంతియాజ్ వెల్లడించారు. ముఖ్యంగా పంజాబ్ ప్రజలు ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.