Aditya N
Bramayugam Moive OTT Streaming: మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇతర భాషల్లో డబ్బింగ్ అవుతూ.. ఓటీటీలో సందడి చేస్తున్నాయి. మెగాస్టార్ మమ్ముట్టి నటించిన భ్రమయుగం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
Bramayugam Moive OTT Streaming: మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇతర భాషల్లో డబ్బింగ్ అవుతూ.. ఓటీటీలో సందడి చేస్తున్నాయి. మెగాస్టార్ మమ్ముట్టి నటించిన భ్రమయుగం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
Aditya N
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇటీవలే విడుదలైన భ్రమయుగంతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్టు అందుకున్న సంగతి తెలిసిందే. సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్ లో తీసి మమ్ముట్టి పెద్ద ప్రయోగమే చేశారు. అయితే ఆ ప్రయోగానికి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకు పైనే గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ మొదట మలయాళంలో విడుదలయింది. అక్కడ సూపర్బ్ టాక్ రావడంతో తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలైంది. అయితే రివ్యూల వరకూ మంచి స్పందనే వచ్చినా… కలెక్షన్లు మాత్రం పెద్దగా రాలేదు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లీవ్ నుంచి వచ్చిన తాజా అప్డేట్ ప్రకారం భ్రమయుగం 2024 మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంటుందనే విషయం దాదాపుగా కన్ఫర్మ్ అయినప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
17వ శతాబ్దంలో ఒక పాడు పడిన రాజభవనంలో ముగ్గురి ప్రధాన పాత్రల మధ్య జరిగే కథగా తెరకెక్కిన భ్రమయుగం సినిమాని ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా చూపించటంలో దర్శకుడు రాహుల్ ప్రతిభ కనపడుతుంది. ఇక స్టార్ గా మాత్రమే కాకుండా విలక్షణ నటుడిగా కూడా ఇమేజ్ ఉన్న మమ్ముట్టి తన పాత్రని అద్భుతంగా పోషించారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన నటన కొన్ని సన్నివేశాలలో ప్రేక్షకులని భయపెట్టింది. స్వార్థంతో కూడుకున్న ఒక రాక్షసుడిలాంటి పాత్రలో తనదైన ముద్ర వేశారనే చెప్పాలి. గత సంవత్సరం కన్నుర్ స్క్వాడ్, కాదల్: ది కోర్ వంటి సినిమాలతో రెండు పూర్తి భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులని ఆకట్టుకున్న మమ్ముట్టి… ఈ ఏడాది భ్రమయుగంతో మరోసారి మెప్పించారు. మరి వచ్చే వారం డిజిటల్ ఫీల్డ్ లో అడుగుపెట్టనున్న ఈ హారర్ థ్రిల్లర్ కు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం.