Venkateswarlu
కోట బొమ్మాళి పీఎస్ సినిమా నవంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచే గాక, రివ్యూవర్ల దగ్గరినుంచి కూడా మూవీకి మంచి రివ్యూలు వచ్చాయి.
కోట బొమ్మాళి పీఎస్ సినిమా నవంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచే గాక, రివ్యూవర్ల దగ్గరినుంచి కూడా మూవీకి మంచి రివ్యూలు వచ్చాయి.
Venkateswarlu
హీరో శ్రీకాంత్, శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్‌లు ప్రధాన పాత్రలో నటించిన కోట బొమ్మాళి పీఎస్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నవంబర్ 27వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విడుదల అయింది. ప్రేక్షకుల నుంచే గాక, రివ్యూవర్ల దగ్గరినుంచి కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా కూడా పర్వాలేదు అనిపించుకుంది. కోట బొమ్మాళి పీఎస్ .. మలయాళ సినిమా నాయట్టు రీమేక్‌గా తెరకెక్కింది.
నాయట్టుకు మార్టిన్ ఫక్కట్ దర్శకత్వం వహించారు. తెలుగు రీమేక్ ‘ కోట బొమ్మాళి పీఎస్’కు తేజ మణి దర్శకత్వం వహించారు. అయితే, మూవీ కథలో చాలా మార్పులు చేశారు తేజమణి. కథ తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా చూసుకున్నారు. సినిమా మొత్తం శ్రీకాకుళం ప్రాంత నేపథ్యంలో సాగుతుంది. చిత్ర నటీనటులు తమ ప్రాతల్లో జీవించేశారు. శ్రీకాంత్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిత్ర క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌తో మనకు కన్నీళ్లు రాక మానవు.
ప్రధాన పాత్రలు చేసిన శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్, మురళీ శర్మలు ఒకరితో ఒకరు పోటా పోటీగా నటించారు. ఇక, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి గత కొద్దిరోజుల నుంచి కొన్ని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వనుందని తెలిసినా.. డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు. తాజాగా, కోట బొమ్మాళి పీఎస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ ఆహాలో జనవరి నెలలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంక్రాంతి రోజునుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇందుకు సంబంధించి ఆహా ఓ అఫిషియల్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ మేరకు తమ ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘‘రాజకీయ వ్యవస్థను, నాయకులను ప్రశ్నించి నిలదీసిన ముగ్గురు పోలీసుల కథ ఈ కోట బొమ్మాళి పీఎస్ కథ… ఈ సంక్రాంతి కి, మీ ఆహలో!. మీ సంక్రాంతి లిస్ట్‌లో థ్రిల్లర్‌ను యాడ్ చేస్తున్నాం ’’ అని పేర్కొంది.
కోట బొమ్మాళి కథ విషయానికి వస్తే..
రామకృష్ణ( శ్రీకాంత్), కుమారి( శివానీ రాజశేఖర్), రవి ( రాహుల్ విజయ్) కోట బొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా పని చేస్తూ ఉంటారు. కుమారి తన బావ కారణంగా వేధింపులకు గురి అవుతూ ఉంటుంది. ఓ సారి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కుమారి బావ మీద రామకృష్ణ, రవిలు దాడి చేస్తారు. ఆ తర్వాత అనుకోని విధంగా ముగ్గరూ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. మర్డర్ కేసులో ఇరుక్కున్న తర్వాత వీరి జీవితం ఎలా మారింది? మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే మిగిలిన కథ. మరి, కోట బొమ్మాళి పీఎస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
రాజకీయ వ్యవస్థను, నాయకులను ప్రశ్నించి నిలదీసిన ముగ్గురు పోలీసుల కథ ఈ #KotabommaliPS కథ… ఈ సంక్రాంతి కి, మీ ఆహలో!
Adding dose of thrill to your festival movie list 🥳@actorsrikanth #BunnyVass #VidyaKoppineedi @DirTejaMarni @GA2Official @varusarath5 @bhanu_pratapa @Rshivani_1… pic.twitter.com/Zq45kmmCph— ahavideoin (@ahavideoIN) December 31, 2023